జబర్దస్త్ లో స్కిట్స్ సరిగ్గా చేయకపోతే అలా చేస్తారట.. రూమ్ కు పిలిచి..?

కాలంతో పాటే సినిమాను చూసే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతున్నాయి.కొత్తదనం ఉన్న కథలకు ప్రేక్షకులు పట్టం కడుతుండగా కామెడీతో కూడిన సినిమాలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 Rocket Raghava About Jabardasth Behind The Story, Rocket Raghava ,jabardasth Beh-TeluguStop.com

బుల్లితెరపై ఎక్కువ సంఖ్యలో కామెడీ షోలు ప్రసారమవుతుండగా మిగతా షోలతో పోలిస్తే జబర్దస్త్ షో గడిచిన 8 సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.షోకు ప్రేక్షకాదరణ తగ్గిన ప్రతిసారి షో నిర్వాహకులు ఏదో ఒక విధంగా షోపై హైప్ పెంచుతున్నారు.

అయితే జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ షోలో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే రాకెట్ రాఘవ మాత్రమే అనే సంగతి తెలిసిందే.తాజాగా రాకెట్ రాఘవ ఒక సందర్భంలో జబర్దస్త్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మొదట జెమినీ ఛానల్ లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన రాకెట్ రాఘవ జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Story, Jabardasth Show, Raghavaskits, Rocket Raghava, Rocketraghava-Movie

జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి అక్కడ అవకాశాలు రాని పక్షంలో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లలేదని రాకెట్ రాఘవ తెలిపారు.పాత వాళ్ల నుంచి ఏ విధంగా నేర్చుకున్నానో కొత్తవాళ్ల నుంచి కూడా అదే విధంగా నేర్చుకుంటున్నానని రాకెట్ రాఘవ చెప్పుకొచ్చారు.కమెడియన్లు స్కిట్లు సరిగ్గా చేయని పక్షంలో షోలో చాలా జరుగుతాయని రాఘవ పేర్కొన్నారు.

Telugu Story, Jabardasth Show, Raghavaskits, Rocket Raghava, Rocketraghava-Movie

జడ్జీలు మొహం మీదే ఏం స్కిట్లు చేశావని కామెంట్లు చేస్తారని అక్కడి పరిస్థితులను రాఘవ వెల్లడించారు.కొన్నిసార్లు సపరేట్ గా రూమ్ కు పిలిచి ఎక్కువమొత్తం పారితోషికాలు తీసుకుంటారు కదా స్కిట్లు బాగా చేయాలి కదా అని క్లాస్ తీసుకునే వాళ్లని రాకెట్ రాఘవ పేర్కొన్నారు.మొదట్లో జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ స్కిట్లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తరువాత మాత్రం అదిరిపోయే పంచ్ లతో రాకెట్ రాఘవ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube