వైరల్: ఇక నుంచి విధుల్లో సందడి చేయనున్న రోబోలు..!

ప్రజలు రద్దీగా ఉండే ముఖ్యమైన ప్రదేశాలలో సినిమా హాల్స్, షాపింగ్‌ మాల్స్‌ , బస్టాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌ ముఖ్యమైనవి.ఆ ప్రదేశాలలో ఎప్పుడు కూడా జనాలు గుమికూడి ఉంటుంటారు.

 Robots That Will Make Noise In Duties From Now On ..! Viral Latest, Viral News,-TeluguStop.com

అలాంటి ప్రదేశాలలోనే ఎక్కువగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అందుకనే రద్దీగా ఉండే చోట నిత్యం పోలీసులు పహారా కాస్తూ ఉంటారు.

ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినాగాని ఎక్కడో ఒక చోట అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.అలాగే ఇప్పుడు కరోనా కాలం నడుస్తుంది.

కరోనా వైరస్ ను అరికట్టే క్రమంలోప్రజలను బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉండకూడదని, సామాజిక దూరం పాటించాలని చెప్తూనే వస్తున్నారు.ఈ క్రమంలో ప్రజలను కంట్రోల్‌ చేయడం కోసం పోలీస్‌ యంత్రాగం నానా తంటాలు పడుతున్నారు.

అయితే ఇప్పుడు పోలీసులు చేసే ఈ పనిని ఒక రోబో చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.రోబో టెక్నాలజీతో అలాంటి అవాంచనీయ సంఘటనలను అదుపులో పెట్టాలని సింగపూర్‌ ప్రభుత్వం ఈ సరికొత్త ఆలోచన చేసింది.

అసలు వివరాల్లోకి వెళితే.సింగపూర్‌ లోని హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్‌లలో రెండు చక్రాల రోబో గత మూడు వారాలుగా ఆ ప్రదేశంలో సంచరిస్తూ వస్తుంది.

ఎందుకంటే అక్కడ మాల్‌ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అక్కడకు వచ్చిన ప్రజలను గమనించడంతో పాటు, అందరు సామాజిక దూరం పాటించేలా ఆ రోబో అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది.

Telugu Robots, Street, Latest-Latest News - Telugu

అంతేకాకుండా నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేసినాగాని, పార్కింగ్‌ సరిగ్గా చేయకపోయినా ఈ రోబో వారిని పసిగట్టేలా చర్యలు చేపట్టారు.కాగా ఈ రోబోలలో మొత్తం ఏకంగా 7 కెమెరాలను కూడా అమర్చారు.ఈ కెమెరాలతో మనుషుల ఫేస్ ను గుర్తించడంతో పాటు వారికి వాయిస్‌ రికార్డర్‌ ద్వారా హెచ్చరికలు చేస్తుంది.

సింగపూర్‌ ప్రభుత్వాధికారులు హైపర్ ఎఫిషియెంట్, టెక్ డ్రైవ్డ్ “స్మార్ట్ నేషన్” పై దృష్టి సారించి ఈ అత్యధునిక టెక్నాలజి కలిగిన రోబోలను తయారుచేసారు.ఇక ఇదిలా ఉండగా ఈ రోబోలను ఉపయోగించడం వలన మనుషులలో శ్రామిక శక్తి తగ్గిపోవడంతో పాటు, రోబోల వల్ల తమ గోప్యత దెబ్బతింటుందని కొంతమంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube