కరోనా టెస్టులు చేయడానికి సిద్ధం కాబోతున్న రోబోలు..!

గత సంవత్సరం జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ నిర్ణయంతో జపాన్ అధికారులు తీవ్ర మనస్థాపానికి గురిఅయ్యారు.

 Carona Virus, Robos, Carona Tests, Health Minister, Japan, Olmpics,robos-dactors-TeluguStop.com

మరో 200 రోజులలో టోక్యో ఒలింపిక్స్ క్రీడల మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో.జపాన్ వారి దేశంలో కరోనా కంట్రోల్ అయిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

అందుకు జపాన్ కరోనా వైరస్ ను అధికమించేదుకు ఆ దేశంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని.దానిని నిరూపించుకునేందుకు ఏకంగా రోబోలను ఉపయోగిస్తున్నారు.

ఇందుకుగాను జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కొన్ని రోబోలను పరిశీలన చేశారు.ఆ రోబోలు టెస్ట్ స్వయంగా నిర్వహిస్తూన్నాయి.

రోబోలు వాటికి అమర్చిన చేతుల సహాయంతో పేషంట్ల ముక్కు నుంచి స్వాబ్ తీసుకొని కరోనా టెస్ట్ నిర్వహిస్తూ కేవలం 20 నిమిషాల్లోనే కరోనా వైరస్ ఉందో లేదో అని తెలియజేస్తుంది.ఇక ఈ సందర్భంగా కవాసాకీ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు మాట్లాడుతూ ఈ రోబోలు షిప్ లోని కంటేనర్ లలో ఉంచి అలాగే ట్రక్కుల్లో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చుచు.

అలాగే ఎక్కువగా ప్రజలు ఉండే ప్రాంతాలు అయినా స్టేడియంలో పార్కులు వంటి ప్రాంతాలలో ఈ రోబోలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలియజేసింది.

అలాగే ఈ సందర్భంగా జపాన్ ఆరోగ్యశాఖ మంత్రి నిరోహిసా తామురా మాట్లాడుతూ.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కరోనా వైరస్ టెస్ట్ లను అధికంగా చేయించవలసి ఉంటుందని.అలాగే ఎక్కువగా జరిపించాలని డిమాండ్ కూడా వస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

అలాగే జపాన్ లో ఇంకా ఇప్పటికీ కూడా కరోనా వ్యాక్సిన్ ప్రారంభం అవ్వలేదని, ఇలాంటి సమయంలో డాక్టర్ లకు కాస్త శ్రమ తగ్గే విధంగా రోబోలను ప్రవేశపెడితే బాగుంటుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రయోగాత్మకంగా ఉన్న రోబోలు అన్ని కూడా 16 గంటలలో 2000 కరోనా టెస్ట్ లు నిర్వహించగలవు.

వీటిని 40 అడుగుల ఎత్తు ఉన్న షిప్పింగ్ కంటైనర్ లో భద్రపరచారు.ప్రస్తుతం జపాన్ లో రోజుకు 55,000 పీసీఆర్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వ డేటా తెలియచేస్తుంది.

ప్రస్తుతం జపాన్ లో ఇప్పటివరకు 3,34,328 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా కరోనా బారిన పడి 4,548 మంది మృత్యువాత పడ్డారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube