బిగ్‌బాస్ 4: కిడ్నాప్ అయిన దివి.. హౌస్‌లో రచ్చ రచ్చ!  

robots kidnap diwi in bigg boss 4! robots, kidnap, diwi, bigg boss 4, latest news, bigg boss telugu, nagarjuna, physical tasks - Telugu Bigg Boss 4, Bigg Boss Telugu, Diwi, Kidnap, Latest News, Nagarjuna, Physical Tasks, Robots

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వారాలు పూర్తి చేసుకుని.మూడో వారంలోకి అడుగుపెట్టింది.

TeluguStop.com - Robots Kidnap Diwi In Bigg Boss 4

మొద‌టి వారం ఏదోలా గ‌డిచిపోయినా.రెండో వారంలో మాత్రం ఇంటి స‌భ్యులంద‌రూ త‌మ‌దైన కామెడీతో బుల్లిత‌ర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక మూడో వారం వ‌చ్చే స‌రికి.బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఫిజికల్ టాస్క్ ఇవ్వ‌డంతో ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

TeluguStop.com - బిగ్‌బాస్ 4: కిడ్నాప్ అయిన దివి.. హౌస్‌లో రచ్చ రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఉక్కు హృదయం అనే టాస్క్‌ను బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చారు.ఈ టాస్క్ ప్ర‌కారం.ఇంటి స‌భ్యులు రోబోలు, మనుషులు రెండు టీంలుగా విడిపోయి గ‌ట్టిగా పోటీ ప‌డుతున్నారు.సిల్వర్ బాల్ ఒకటి ఇచ్చి దాన్ని పగలకొడితే రోబోలు చనిపోయినట్టని.

రోబోలు మొత్తం చ‌నిపోతే మ‌నిషులు గెలుస్తార‌ని బిగ్ బాస్ చెప్పారు.అయితే ఒక్క రోబో మిగిలినా రోబోలే గెలిచిన‌ట్ట‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక ఈ టాస్క్‌లో భా‌గంగా.మనుషులు ఇంటి బ‌య‌ట‌ ఉంటారు.రోబోలు మాత్రం ఇంటిలో అన్ని సౌకర్యాలను పొందుతారు.అయితే సమయం గడుస్తున్న కొద్దీ రోబోల్లో చార్జింగ్ తగ్గుతుంది.

వాటిని మనుషులు చార్జ్ చేయాల్సి ఉంటుంది.అలా చార్జ్ చేస్తే.

మ‌నుషుల‌కు ఫుడ్, వాష్‌రూమ్‌, ఇత‌ర సౌక‌ర్యాలు ల‌భిస్తాయి.అయితే చార్జింగ్ తగ్గిపోయి రోబోలు చనిపోవాలన్న ఉద్దేశంలో మ‌నుషులు ఇంటి సౌక‌ర్యాలు ఉప‌యోగించ‌కుండా నానా తిప్ప‌లు ప‌డ‌తారు.

దీంతో అరియానాకు చార్జింగ్ త‌గ్గుతుండ‌డంతో.ఆమె మిగిలిన టీంతో వాదించి మ‌నుషుల‌తో పోరాడేందుకు బ‌య‌ట‌కు వెళ్తుంది.ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది అన్న ఆస‌క్తి నెల‌కొన్న క్ర‌మంలో తాజాగా స్టార్ మా ఓ ప్రోమో విడుద‌ల చేసింది.అందులో చార్జింగ్ చేసుకునేందుకు రోబోలు చేసేదేమి లేక‌.

మ‌నుషుల‌ను కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్ చేస్తారు.

ఇక ముందుగా అనుకున్నట్లుగానే ఇంటి డోర్ వద్దకు వచ్చిన దివిని రోబోలు కిడ్నాప్ చేస్తాయి.

దీంతో రోబోల తీరుపై మ‌నుషులు ఆగ్ర‌హంతో ఊగిపోతారు.టాస్క్ కోసం ఒక అమ్మాయిని అలా హింసిస్తారా అంటూ ర‌చ్చ ర‌చ్చ చేస్తారు.

ముఖ్యంగా సోహైల్ కోపంతో రోబోల‌ను నానా భూతులు తిడ‌తాడు.మ‌రి దివిని కిడ్నాప్ చేసిన రోబోలు ఏం చేశారు? అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో తెలియ‌నుంది.

#Kidnap #Nagarjuna #Physical Tasks #Robots #Diwi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Robots Kidnap Diwi In Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..