సరుకులను డోర్ డెలివరీ చేస్తున్న రోబోలు.. ఎక్కడో తెలుసా..?!

ప్రపంచంలో రోజురోజుకి టెక్నాలజీని మనిషి వినియోగం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకరోజు ఉన్న టెక్నాలజీ మరొకరోజు కనబడటంలేదు.

 Robots Delivering Goods Door  Do You Know Somewhere, Door Delivery, Singapore, R-TeluguStop.com

కొత్త టెక్నాలజీతో ముందు టెక్నాలజీని మరిచిపోయేలా చేస్తుంది.ఇకపోతే మనుషుల పనులు కూడా ఈ కాలంలో రోబోలు ఇట్లే చేసేస్తున్నాయి.

ఇందుకు తార్కాణంగా తాజాగా డోర్ డెలివరీ ఎవరు చేస్తారు చెప్పండి మామూలుగా అయితే ఎవరైనా మనిషి వచ్చి మీకు సంబంధించిన వస్తువులను డెలివరీ తీసుకువస్తాడు.

అయితే ఇక ఆ కాలానికి త్వరలో చెల్లు కాబోతున్నట్లు కనబడుతోంది.

దీనికి కారణం డెలివరీ బాయ్స్ బదులు ఇప్పుడు రోబోలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.తాజాగా సింగపూర్ దేశానికి చెందిన ఓ కంపెనీ ఇలాంటి రోబోలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఈ ప్రక్రియ తో రోబోలు ఆ దేశంలో బిజీబిజీగా గడిపేస్తున్నాయి.

ఇకపోతే ఆ కంపెనీ రోబోలకు పేరు కూడా పెట్టింది.

కామెల్లో అని ఎవరైనా పిలవగానే ఈ రోబోలు ఎస్ బాస్ అంటూ రెడీ అయిపోతున్నాయి.మొత్తం 20 కేజీల సరుకు పెట్టుకునేందుకు ఆ రోబో లో స్థలం ఉంటుంది.

మీరు ఏవైనా ఆర్డర్ చేస్తే అందుకు సంబంధించిన వస్తువులను ఆ రోబో నింపుకొని మీరు ఎక్కడికి అయితే డెలివరీ చెప్పారో అక్కడ వాలిపోతాయి.ఆ తర్వాత సరుకులు తీసుకున్నాక రోబోలు అవి వాటిని శుభ్రపరుచుకుంటాయి.

ఇక అల్ట్రావైలెట్ లైట్ విధానం ద్వారా ఏవైనా వైరస్ లాంటివి ఉంటే వాటిని పూర్తిగా నాశనం చేయగలుగుతాయి.ప్రస్తుతం ఈ రోబోట్లు రోజుకు నాలుగు నుంచి ఆరు డోర్ డెలివరీలు చేయగలుగుతున్నాయి.

ఈ కంపెనీ నుండి ప్రస్తుతం ఏడు వందల రోబోలు నిర్విరామంగా పని చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube