కంపెనీలో సీఈవో బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోబో.. ఈ గొప్ప ఆవిష్కరణ ఆ దేశంలోనే

భవిష్యత్తులో మానవులకు ఉద్యోగాల కొరత ఏర్పడనుంది.ఎందుకంటే రోబోలు ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టాయి.

నమ్మశక్యం కాకపోయినా, ఇది వాస్తవం.తాజాగా చైనాలోని మెటావర్స్ కంపెనీ సీఈవో పదవిలో టాంగ్ యూ అనే రోబోను ఉంచింది.

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన పవర్డ్ వర్చువల్ హ్యూమనాయిడ్ రోబోట్.దీంతో ఈ పదవి చేపట్టిన ప్రపంచంలోనే మొదటి రోబోట్ అయింది.

నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ అనేది చైనీస్ కంపెనీ, ఇది మొబైల్ కోసం అప్లికేషన్‌లను తయారు చేస్తుంది మరియు మల్టీప్లేయర్ ఆన్‌లైన్ గేమ్‌లను కూడా నిర్వహిస్తుంది.కంపెనీ యొక్క ప్రధాన అనుబంధ సంస్థ - ఫుజియాన్ నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ పనిని పర్యవేక్షించడానికి హ్యూమనాయిడ్ రోబోట్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.

Advertisement
Robot Is Appointed As Ceo Of Chinese Metaverse Company Details, Company, Ceo, Te

సుమారు 10 బిలియన్ల డాలర్ల విలువైన ఆ సంస్థకు సీఈఓగా రోబోట్‌ను పెట్టడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.కంపెనీ సంస్థాగత మరియు సమర్థతా విభాగాలను ఇది చూసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

నియామకం గురించి NetDragon కంపెనీ ఛైర్మన్ డాక్టర్.డెజియన్ లియు స్పందించారు.

Robot Is Appointed As Ceo Of Chinese Metaverse Company Details, Company, Ceo, Te

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కార్పొరేట్ మేనేజ్‌మెంట్ భవిష్యత్తుగా తాము విశ్వసిస్తామని చెప్పారు.రోబోట్ టాంగ్ యు నియమించడంతో తాము పనిచేసే విధానాన్ని మార్చడానికేనని అన్నారు.తమ వ్యాపారం అంతిమంగా భవిష్యత్ వ్యూహాత్మక వృద్ధిని నడిపిస్తుందన్నారు.

రోబోట్ చాలా సబ్జెక్టివ్, మానవ స్పర్శ అవసరమయ్యే పనులను కూడా చేస్తుందని కంపెనీ పేర్కొంది.ఇది ప్రతిభను అభివృద్ధి చేసే పనులను చేపడుతుందని, ఉద్యోగులందరికీ ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని అందించడానికి మానవ వనరుల నిర్వహణలో పని చేస్తుందని వివరంచారు.

రైలులోని అమ్మాయిలపై నీళ్లు చల్లిన యువకుడు.. వీపు పగిలేలా కొట్టిన పోలీస్ (వీడియో)
Advertisement

తాజా వార్తలు