వైరల్ గా మారిన రోబో హమ్మింగ్ బర్డ్ తీసిన వీడియో!

సీతాకోక చిలుకలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.ఎన్నో రంగు రంగుల సీతాకోక చిలుకలు పూల తోటలో సందడి చేస్తూ ఉంటే ఆ పూల తోట కి మరింత అందాన్ని సీతాకోక చిలుకలు తెచ్చిపెడతాయి.

 Robot Hummingbird Films Butterflies Taking Flight, Robot, Humming Bird, Viral Vi-TeluguStop.com

అవి ఒకచోట నుంచి మరొక చోటకు ఎగురుతూ ఉంటే చూడడానికి కనులవిందుగా ఉంటుంది.కొన్ని సీతాకోక చిలుకలకే ఇంత అందం వస్తే, లక్షల సంఖ్యలో ఉన్న సీతాకోక చిలుకలు ఒక చెట్టుపై విశ్రాంతి తీసుకుంటే చూడడానికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
కొన్ని లక్షల సంఖ్యలో సీతాకోక చిలుకలు చెట్లపై వాలటం ఎప్పుడైనా చూసారా? అయితే రోబో హమ్మింగ్ బర్డ్ తీసిన వీడియో చూస్తే ఇది నిజంగా సీతాకోక చిలుకల తోటా అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.రోబో హమ్మింగ్ బర్డ్ తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకుంటుంది.

ఈ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
అమెరికాలోని మెక్సికన్ అరణ్యంలో ఒక రోబోటిక్ హమ్మింగ్ బర్డ్ కి స్పై కెమెరాను బిగించి, నిజమైన పక్షిలగా ఎగురుతూ కనిపించేలా ఈ రోబోటిక్ బర్డ్ కి రెండు ప్రోఫెలోర్స్ ను అమర్చారు.

దీంతో ఈ హమ్మింగ్ బర్డ్ అడవి మొత్తం కలియతిరుగుతూ, అక్కడ ఉన్నటువంటి అందమైన సీతాకోకచిలుకలను వీడియో తీసింది.ఈ రోబోటిక్ హమ్మింగ్ బర్డ్ ఆ అడవిలో సీతాకోకచిలుకలను ఎంతో అద్భుతంగా చిత్రీకరించిందని ఈ ప్రాజెక్టు ప్రతినిధి పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం హమ్మింగ్ బర్డ్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వావ్ అని అనకుండా ఉండలేరు.అంత అద్భుతంగా చిత్రీకరించిన ఈ వీడియో ప్రస్తుతం ఎంతోమంది నెటిజన్లను ఆకర్షించింది.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి, మనసారా ఆనందించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube