2.ఓ లో పక్షిరాజా పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా.? ఆయన ఇప్పుడు ఉండుంటే..?  

భారీ అంచనాల నడుమ విడుదలైన రోబో 2 సక్సెస్ వైపుగా దూసుకుపోతుంది. అటు కల్లెక్షన్డ్స్ అందుకోవడంలోనే కాదు…ఇటు ఆడియన్స్ ప్రశంసలు అందుకోవడంలోను హిట్ కొట్టింది ఈ సినిమా. ఈ సినిమాలో రజినీకాంత్ పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉందొ…అంతే ప్రాధాన్యం అక్షయ్ కుమార్ పాత్రకి కూడా ఉంది.

Robo 2 Movie Pakshi Raja Role Inspiration-Indian Birds Father Salim Ali Pakshi Inspiration

Robo 2 Movie Pakshi Raja Role Inspiration

పక్షిరాజా పాత్రకు తనవంతు న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ లో సెల్ ఫోన్స్ ని మాయం చేసిన కాకిగా భయపెట్టారు..సెకండ్ హాఫ్ లో పక్షులను ప్రేమించే పక్షిరాజాగా ఎమోషన్ పండించారు. సినిమా మొత్తం పక్షిరాజా చెప్పిన మాట ఒక్కటే…సేవ్ బర్డ్స్. స్టాప్ సెల్ ఫోన్స్.

Robo 2 Movie Pakshi Raja Role Inspiration-Indian Birds Father Salim Ali Pakshi Inspiration

అయితే ఈ పాత్రను తెరకెక్కించడానికి శంకర్ కి స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.? ఇండియన్ బర్డ్స్ ఫాథర్ అని పిలుచుకునే సలీం అలీ గారి స్పూర్తితో పక్షిరాజా పాత్రను తెరకెక్కించారు శంకర్. పక్షుల మనుగడ కోసం ఆయన చాలా కృషి చేశారు. 1987 లో మరణించారు. అప్పటికి ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు. ఇన్ని సెల్ ఫోన్లు రాలేదు. పక్షుల మనుగడకు పెద్దగా అప్పట్లో ముప్పు లేదు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ఎంతగా బాధపడేవారో పక్షిరాజా పాత్ర ద్వారా శంకర్ ప్రజలకు అర్థమయ్యేలా చేసారు.