వీఐపీ కల్చర్ గురించి మీరు మాట్లాడకూడదు సార్ !

వీఐపీ కల్చర్ మీద విరుచుకుపడడం అందరికీ సహజం, కానీ కొందరు వీఐపీ కల్చర్ విషయంలో ఓవర్ గా ప్రవర్తిస్తే నవ్వొస్తుంది.ముఖ్యంగా రాబర్ట్ వాద్రా లాంటి వారు వీఐపీ కల్చర్ గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం.

 Robert  Vadra Speaks About Vip Culture-TeluguStop.com

డిల్లీ గవర్నమెంట్ తీరు మీద రాబర్ట్ వాద్రా సీరియస్ అయ్యారు.

ఢిల్లీ రోడ్లపై కార్లకు సంబంధించి ఆడ్ , ఈవెన్ ఫార్ములా విషయంలో వాద్రా స్పందించాడు.

ఇది మంచి పద్ధతైనా, మంచిది కాకపోయినా.ఈ విషయంలో వీఐపీలకు మినహాయింపు ఇవ్వడం తప్పు అని వాద్రా అంటున్నాడు! వీఐపీ లకి వీటిల్లో మినహాయింపు ఇచ్చి వారిని నెత్తిన పెట్టుకోవడం పట్ల వాద్రా కోపంగా ఉన్నారు.

అందరిలాగానే వారిని కూడా దీని కిందకి లాగాలి అనేది ఆయన డిమాండ్.ఇంతలోనే ఇంత మార్పు అంటున్నారు ఇది విన్నవారు అందరూ.

వాద్రా గారు స్వయంగా ఇలా మాట్లాడ్డం విడ్డూరం కాదా మరి ?

ఏడాదిన్నర కిందటి వరకూ వాద్రా వీవీఐపీ హోదా విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి.కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి అల్లుడు అయినందు వల్ల వాద్రాను విమానాశ్రయాల్లో చెక్ చేయడం లేదని, దేశంలో ఇలాంటి మినహాయింపు కలిగిన అతి తక్కువ మందిలో వాద్రా కూడా ఒకడు.

పెద్ద దుమారం లేపింది ఈ అంశం అప్పట్లో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube