ఉలిక్కిపడిన అమెరికా మరోసారి కాల్పులు..!   Robert Bowers: What To Know About Pittsburgh Synagogue Shooting     2018-10-28   17:56:07  IST  Surya

అమెరికాలో వరుస కాలుపులు అక్కడ ప్రజలని భయబ్రాంతులకి గురిచేస్తున్నాయి. ఒక దుండగుడు జరిపిన కాల్పులలో సుమారు 11 మంది అక్కడికక్కడే చనిపోయారని అమెరికా పోలీసులు ట్విట్టర్ లో వెల్లడించారు.

గెడ్డంతో ఉన్న శ్వేతజాతీయుఏడు ఒకరిని ఈ ఘటనకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అక్కడి చానెల్స్ ప్రకారం చూస్తే యూదులు అందరూ చనిపోవాలి అని అరుస్తూ లోనికి జొరబడి కాల్పులు జరిపినట్లు చెపుతున్నారు.

అయితే వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసు అధికారులు కాల్పులు జరుగకుండా అడ్డుకున్నారు.. ఈ ఘటనలో ముగ్గురు అధికార్లు సైతం గాయపదినట్లుగా తెలుస్తోంది.. పెన్సిల్వేనియా గవర్నర్‌ టామ్‌ వోల్ప్‌ మాట్లాడుతూ వెనువెంటనే తక్షణ సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పిట్స్‌బర్గ్‌ మెడికల్‌ కేంద్రంలో క్షతగాత్రులందరికి చికిత్స చేస్తున్నారు.

Robert Bowers: What To Know About Pittsburgh Synagogue Shooting-

అయితే ఈ దుండగుడు జరిపిన కాల్పులలో ఎక్కువ మంది క్షతగాత్రులు ఉన్నారని , పిట్స్‌బర్గ్‌ పోలీస్‌ కమాండర్‌ వెల్లడించారు. స్థానిక నివాసితులెవ్వరూ బైటికి రావద్దని ముందుగానే హెచ్చరించారు. ఈ దాడికి పాల్పడింది 46 ఏళ్ల రాబర్ట్ బోవర్స్‌గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.