అమెరికన్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వేళ...!!!

కళ్ళ ఎదురుగా ఏదైనా అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోలేం.ఎంతో బాధపడుతాం, మన స్థాయిలో ఆ అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం.

 Thieves Attacks Woman, Man, Knife, Robbery,ambulance, Newyork, Nri News-TeluguStop.com

లేదంటే తల పక్కకి తిప్పేసుకుని వెళ్ళిపోతాం.కానీ అమెరికాలో ఓ వక్తి అలా తల పక్కకి తిప్పుకుని వెళ్ళిపోలేదు.

అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించాడు.కానీ దుండగులు చేసిన దాడిలో తీవ్ర రక్త స్రావం అయ్యి ఆసుపత్రి పాలయ్యాడు.

ఈ క్రమంలోనే అతడిని చూసిన అమెరికన్స్ అందరూ ఉలిక్కిపడ్డారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతడే హాట్ టాపిక్.

ఇంతకీ అసలేం జరిగింది.

అమెరికాలోని న్యూయార్క్ లో ఓ మహిళ ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది.

కొందరు దొంగలు ఆమెని అడ్డుకుని ఆ మహిళ పరుసు కాజేయాలని ప్రయత్నిస్తున్నారు.ఎంతో మంది ఈ ఘటనని చూసినా ఎవరూ ఆమెకి సాయం చేయలేదు.

ఆమెని తీవ్రంగా కొట్టడం చూసిన ఓ కుర్రాడు మాత్రం ఒక్క సారిగా అక్కడికి చేరుకున్నాడు.దొంగలతో వాదించాడు.

వారిని అడ్డుకున్నాడు.ఈ క్రమంలోనే వాళ్ళు అతడిని తీవ్రంగా గాయపరిచి కత్తితో తలపై పొడిచేసారు.

Telugu Ambulance, Knife, Newyork, Nri, Robbery-Telugu Visual Story Telling

తల, మేడపై కత్తి పోట్లు అవ్వడంతో తీవ్ర రక్త శ్రావం అయ్యింది.అంతేకాదు ఆ కత్తి తలపైనే ఉండటంతో ఆలాగే యువకుడు రక్తం కారకుండా చేతికి గుడ్డని కట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు.తనని రక్షించుకోవడానికి అంబులెన్స్ కోసం రోడ్లపై నడుస్తూ వెళ్ళాడు.దాంతో ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు ఓ ఆసుపత్రికి తరలించారు.సదరు మహిళకి కూడా కత్తి పోట్లు అవ్వడంతో ఆమె కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.అతడి తలపై కత్తితో ఉన్నప్పుడు కొందరు తీసిన వీడియో సోషల్ మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

దుండగులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.కేసుని నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube