పేషెంట్ ని కూడా వదలటం లేదు  

Robbers Not Leaving Patients Too-

పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు తమ రూటు మార్చారు.ఇళ్ళు,బ్యాంకులు, ఏటీఎంలే కాదు.ఆసుపత్రులను సైతం తమ టార్గెట్‌ లిస్టులో చేర్చేశారు.ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన దోపిడీ ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం విజయకుమార్‌ దంపతులు తమ కుమార్తెతో కలసి వచ్చారు..

Robbers Not Leaving Patients Too---

వంటి మీద ఉన్న ఆభరణాలను ఓ బ్యాగ్‌లో ఉంచారు.నర్సు వచ్చి ఇంజక్షన్‌ చేసి వెళ్ళిన తరువాత… తలుపు దగ్గరుకు వేసి పడుకున్నారు. మరోసారి నర్సు రావాల్సి ఉన్నందున తలుపు గడియ పెట్టలేదు.అయితే.

అంతలోనే ఓ దొంగ వచ్చి.బ్యాగ్‌లోని 10 కాసుల బంగారం, 15వేల నగదును ఎత్తుకు పోయాడు.నిద్రనుంచి మేలుకున్న విజయకుమార్‌ దంపతులు అరవటంతో… బయట తలుపు గడియపెట్టి పరారయ్యాడు.అయితే… ఈ విజువల్స్‌ అన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఈ దోపిడీ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.సిసి కెమెరాలో దొంగ విజువల్స్‌ రికార్డు అవ్వటంతో… పోలీసులు వేట మొదలు పెట్టారు.