ఇదేం వింత..దొంగతనం చేస్తుంటే కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసిన దొంగ!

ఈ మధ్య దొంగతనాలు దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా నేరగాళ్లు పెరిపోతున్నారు.

నడి రోడ్డు మీదనే దొంగతనాలకు పాల్పడుతున్నారు.తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే జరిగింది.

ఒక దొంగ నడి రోడ్డు మీద దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు.కానీ అది వీలు కాలేదు.

అక్కడ జనాలు అందరు పోగయ్యి అతడికి దేహశుద్ది చేసారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు దొంగ.

ఎవరైనా దొంగ దొరికితే దేహశుద్ది చేసి మరి పోలీసులకు అప్పజెబుతారు.అయితే ఇక్కడ మాత్రం దొంగనే రివర్స్ లో పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ఆ ఫిర్యాదు ఏమని చేసాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు.అతడు దొంగతనం చేస్తూ ఉండగా చుట్టూ పక్కల వారు చూసి అతడిని నాలుగు తగిలించారని ఆ దొంగ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ఆ దొంగ పేరు జయకుమార్.అతడికి 18 సంవత్సరాలు.సెప్టెంబర్ 2న రోడ్డు పక్కన ఆగి ఉన్న క్యాబ్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి కత్తితో బెదిరించి దొంగతనం చేయాలనీ ప్రయత్నించాడు.కానీ అతడి ప్రయత్నం సఫలం కాలేదు.

క్యాబ్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి నీ దగగ్ర ఉన్న డబ్బులు, ఫోన్ ఇవ్వు లేకపోతే కత్తితో పొడుస్తానని బెదిరించాడు.అయితే క్యాబ్ డ్రైవర్ ప్రతాప్ పాటిల్ అతడిని పక్కకు నెట్టేసి పెద్దగా అరిచాడు.

అలా అరుస్తుండడంతో ఆ దొంగ బయపడి పారిపోతుండగా అందరు వచ్చి అతడికి దేహశుద్ది చేసారు.వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోయాడు.ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ పోలీసులకు దొంగతనం గురించి ఫిర్యాదు చేసాడు.పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.ఆ దొంగ కూడా తిరిగి కంప్లైంట్ ఇచ్చాడు.

Telugu Bengaluru, Domlur Robbery, Richmond Town, Robber Plaint, Robberlodged-Lat

అతడు దొంగతనం చేయబోతే అతడిని 40 మంది వచ్చి కొట్టారని వాళ్ళ వల్ల గాయాలపాలు అయ్యానని అతడు ఫిర్యాదు చేసాడు.అయితే అతడి ఫిర్యాదు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు.దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.సోషల్ మీడియాలో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.దొంగ కత్తితో బెదిరించిన కూడా అతడిని ఏమీ చేయకుండా వదిలేయాలా అంటూ పోలీసులను నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.కానీ పోలీసులు మాత్రం పెట్టుకోవద్దని అనడం లేదు కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube