పవన్ ట్విట్ : ఆ పగుళ్లపై సమాధానం కావాలి     2018-11-04   14:23:50  IST  Sai Mallula

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల తూటాలు వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పోలవరం సమీపంలో కిలోమీటర్ మేర రోడ్డు మార్గానికి పగుళ్ళు రావడంపై ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ పవన్ డిమాండ్ చేశారు. రోడ్ల నాణ్యత విషయంపై వివరణ ఇవ్వాలని నిలదీశారు. చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ టీం.. రోడ్డు పగుళ్ళను గుర్తించిందా ? అని పవన్ ట్వీట్ చేశారు.

Road Rash Tell Me Answer Pawan's Demand On Twitter-

Road Rash Tell Me Answer Pawan's Demand On Twitter

పోలవరం ప్రాజెక్టు వెళ్లే రోడ్డుకు పగుళ్లు ఏర్పడడంతో ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం రహదారికి భారీగా బీటలు ఏర్పడటంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్న సుమారు పది లారీలను డ్రైవర్లు అక్కడే వదిలేసి దూరంగా పరుగులు తీశారు. ఆ రోడ్డు సమీపంలో మట్టి తవ్వుతున్న జెసిబి కొంతభాగం భూమిలోకి కూరుకుపోయింది.