ఎల్ఎల్‌బీ చదివాడు.. పగటివేషాలతో బతికేస్తున్నాడు

కోటి విద్యలు కూటి కోసమే అన్నారు పెద్దలు.దీన్ని నిజజీవితంలో పాటిస్తూ తన జీవితాన్ని గడిపేస్తున్నాడు ఓ పట్టభద్రుడు.

 Road Artist Takes Rs 50 For Selfie With Him-TeluguStop.com

ఎల్ఎల్‌బీ చదివి కూడా తనకు ఇష్టమైన నాటకాలను వదలకుండా పగటివేషాలు వేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు నూకాజీ అనే వ్యక్తి.తుని నుంచి హైదరాబాద్‌కు బతుకుతెరువు కోసం వచ్చిన నూకాజీ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

తనకు ఎంతో ఇష్టమైన నాటకాన్ని మాత్రం వదలలేదు.దీంతో అతడు ఓ వినూత్న ఆలోచనకు తెరలేపాడు.రకరకాల వేషాలు వేస్తూ నగరంలో తిరుగుతూ ప్రజలతో సెల్ఫీలు దిగుతున్నాడు.అయితే తనతో సెల్ఫీలు దిగాలంటే రూ.50 చెల్లించాలంటూ మెడలో బోర్డు వేసుకుని తిరుగుతున్నాడు.అతడి వేషాలతో ముగ్ధులైన ప్రజలు అతడితో సెల్ఫీ దిగి రూ.100, 200, 500 వరకు కూడా ఇస్తున్నారు.

ఇలా తన బతుకుతెరువుకు తనకు ఎంతో ఇష్టమైన వేషధారణలే ఉపయోగపడుతున్నాయంటూ నూకాజీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఇక వచ్చే ఏడాది పెళ్లికి కూడా సిద్ధమవుతున్న నూకాజీ, తనతో ఎక్కువ సెల్ఫీలు దిగి తన పెళ్లికి అందరూ సహకరించాలని కోరుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube