ఎల్ఎల్‌బీ చదివాడు.. పగటివేషాలతో బతికేస్తున్నాడు  

Road Artist Takes Rs 50 For Selfie With Him-llb,nukaji,road Artist,weird News

కోటి విద్యలు కూటి కోసమే అన్నారు పెద్దలు.దీన్ని నిజజీవితంలో పాటిస్తూ తన జీవితాన్ని గడిపేస్తున్నాడు ఓ పట్టభద్రుడు.ఎల్ఎల్‌బీ చదివి కూడా తనకు ఇష్టమైన నాటకాలను వదలకుండా పగటివేషాలు వేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు నూకాజీ అనే వ్యక్తి.తుని నుంచి హైదరాబాద్‌కు బతుకుతెరువు కోసం వచ్చిన నూకాజీ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

Road Artist Takes Rs 50 For Selfie With Him-llb,nukaji,road Artist,weird News Telugu Viral News Road Artist Takes Rs 50 For Selfie With Him-llb Nukaji Road Weird News-Road Artist Takes Rs 50 For Selfie With Him-Llb Nukaji Road Weird News

తనకు ఎంతో ఇష్టమైన నాటకాన్ని మాత్రం వదలలేదు.దీంతో అతడు ఓ వినూత్న ఆలోచనకు తెరలేపాడు.రకరకాల వేషాలు వేస్తూ నగరంలో తిరుగుతూ ప్రజలతో సెల్ఫీలు దిగుతున్నాడు.అయితే తనతో సెల్ఫీలు దిగాలంటే రూ.

50 చెల్లించాలంటూ మెడలో బోర్డు వేసుకుని తిరుగుతున్నాడు.అతడి వేషాలతో ముగ్ధులైన ప్రజలు అతడితో సెల్ఫీ దిగి రూ.100, 200, 500 వరకు కూడా ఇస్తున్నారు.

ఇలా తన బతుకుతెరువుకు తనకు ఎంతో ఇష్టమైన వేషధారణలే ఉపయోగపడుతున్నాయంటూ నూకాజీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఇక వచ్చే ఏడాది పెళ్లికి కూడా సిద్ధమవుతున్న నూకాజీ, తనతో ఎక్కువ సెల్ఫీలు దిగి తన పెళ్లికి అందరూ సహకరించాలని కోరుతున్నాడు.