కర్నూలులో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి..

ఈ మధ్య రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 Road Accident In Kurnool District,kurnool,road Accident,andhra Pradesh,crime New-TeluguStop.com

కొంతమంది గాయపడ్డారు.గాయపడ్డ వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతులను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.కొంతమందికి గాయాలయ్యాయి.అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే వీరందరూ చిత్తూరు జిల్లా మదనపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.

వీరందరూ తీర్థయాత్రకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.వీరందరూ టెంపోలో వెళ్తుండగా మార్గ మద్యంలో లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు.నాలుగు కుటుంబాలు కలిసి తీర్థయాత్రకు బయల్దేరారు. రాజస్థాన్ లోని అజ్మీర్ లో గల హజ్రత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాను సందర్శించడానికి శనివారం రాత్రి ఒక టెంపోలో బయల్దేరారు.కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్దకు రాగానే టెంపోను లారీ వచ్చి ఢీ కొట్టింది.

ఈ ఘ్టనలో టెంపో పల్టీలు కొట్టుకుంటూ గాలిలో ఎగిరిపడింది.

ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు.

అందులో 8 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.మరికొందరు గాయపడ్డారు.

వీరిలో ముగ్గురు పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

రెండు వాహనాల మధ్య చిక్కుకున్న వారిని క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube