సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం! ఆరుగురు మృతి  

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident In Khammam Cross Road-khammam Cross Road,road Accident,telangana

శ్రీరామనవవి రోజున దైవదర్శనం కోసం వెళ్తున్న భక్తులని మృత్యువు లారీ రూపంలో కబలిస్తుంది అని వారు ఊహించి ఉండరు. అందరూ సరదాగా కలిసి వెళ్తున్న సమయంలో అనంతలోకాలకి చేరుతామని ఊహించి ఉండరు. ఇప్పుడు అలాంటి సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ లో జరిగింది..

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం! ఆరుగురు మృతి-Road Accident In Khammam Cross Road

ఖమ్మం క్రాస్ రోడ్డు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరు మంది మృత్యువాత పడ్డారు.

ప్రమాద సమయంలో ఆటోలో సుమారు పది మంది ప్రయాణిస్తూ ఉండగా వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని కోదాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.