అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..!!!  

Road Accident In Fort Saint Lucie Beach Road-telugu Nri News Updates

అమెరికాలోని ఫ్లోరిడాలో తరచూ రోడ్డు ప్రమాదాలు ఎక్క్వుఅగా జరుగుతూ ఉంటాయి.అయితే తాజాగా మరొక ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది, ఈ ఘటనలో కారు డ్రైవర్ తో సహా ముగ్గురు యువతులు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని రహదారి అధికారులు వెల్లడించారు...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..!!!-Road Accident In Fort Saint Lucie Beach Road

అయితే మృతుల వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. పోర్ట్ సెయింట్ లూసీ ప్రాంతంలోని ఓ బీచ్ రోడ్డుపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని తెలిపారు. రోడ్డుపై వేగంగా వెళ్తున్న సెడాన్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీ కొట్టి అక్కడికక్కడే పల్టీలు కొట్టింది.

దాంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. సెడాన్‌లో ఉన్న ఓ డ్రైవర్, అతనితోపాటు ఉన్న ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందగా, ట్రక్ నడుపుతున్న 26 ఏళ్ల యువతి మాత్రం గాయాలతో సురక్షితంగా బయటపడింది.