తెలవారంగానే రోడ్డు ప్రమాదం.. తెల్లారిన కూలీల బ్రతుకులు.. !

కొందరి తలరాతలో ఉన్న దురదృష్టం ఏమో గానీ, గాలానికి చిక్కిన చేప పిల్లలా చటుక్కున్న మరణం అనే వలలో చిక్కిపోతారు వారికి కూడా తెలియదు మృత్యువు తమ వెనకే వికటహాసంతో వస్తుందని.అప్పటి వరకు ఆనందంగా ఉన్న వారి కుటుంబం, తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకుంటామనే నమ్మకం ఇవన్నీంటిని కూడా చెరిపేస్తూ యమపూరికి వెళ్లిపోతారు.

 Road Accident At Guntur District-TeluguStop.com

ప్రస్తుతం కరోనా ఒక్కటే కాదు మనుషులకు మృత్యువు పలు మార్గాల్లో ఎదురవుతుంది.ఇకపోతే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కూలీల బ్రతుల్లో చిచ్చు పెట్టడం తరచుగా కనిపిస్తుంది.ఇటువంటి ఘటనే గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలో చోటు చేసుకుంది.

 Road Accident At Guntur District-తెలవారంగానే రోడ్డు ప్రమాదం.. తెల్లారిన కూలీల బ్రతుకులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈరోజు ఉదయం కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీ కొట్టడంతో, ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా, మరి కొంత మంది కూలీలు గాయపడినట్లుగా సమాచారం.ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడం అందర్ని భీతి గొలుపుతుంది.ఇకపోతే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసుకుని వివారిస్తున్నారట.

#Workers Killed #Nandigama #Road Accident #Guntur District

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు