స్టార్స్‌ అంతా వంట చేస్తూ, ఇల్లు తూడ్చుతూ ఉంటే నేను షూటింగ్‌ చేశా  

Rm Gopal Varma Tweet On Corona Virus Movie - Telugu Be The Real Man, Challenge, Corona Virus, Lock Down, Movie, Ram Gopal Varma, Trailer

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే.ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది.

 Rm Gopal Varma Tweet On Corona Virus Movie

గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ పూర్తిగా నిలిచి పోయాయి.కనీసం ఒక్క చిన్న సీరియల్‌ కాని, షో కాని షూట్‌ జరగలేదు.

కాని రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం ఏకంగా సినిమానే తీసేశాడు.ఈ లాక్‌ డౌన్‌టైంలో లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి సినిమాను చిత్రీకరించి అందరు నోరు వెళ్లబెట్టేలా చేశాడు.

స్టార్స్‌ అంతా వంట చేస్తూ, ఇల్లు తూడ్చుతూ ఉంటే నేను షూటింగ్‌ చేశా-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ త్వరలో సినిమాను సైతం విడుదల చేయబోతున్నాడు.

తాను లాక్‌డౌన్‌లో సినిమాను తెరకెక్కించాను అంటూ పదే పదే రామ్‌ గోపాల్‌ వర్మ గర్వంగా చెప్పుకుంటున్నాడు.

ఈ విషయాన్ని గురించి మరోసారి దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందిస్తూ… స్టార్స్‌ అంతా కూడా ఈ లాక్‌ డౌన్‌లో వంట చేస్తూ, ఇల్లు తూడ్చుతూ, తోట పని చేస్తూ ఎంజాయ్‌ చేస్తూ ఉన్న సమయంలో నేను నా ‘కరోనా వైరస్‌’ సినిమాను పూర్తి చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌లో భాగంగా స్టార్స్‌ అంతా కూడా ఇంటి పనులు చేసి టైం పాస్‌ చేశారు.పలువురు స్టార్స్‌ ఈ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ వీడియోలు చేసి పెట్టారు.ఇప్పుడు వారికి వర్మ ట్వీట్‌ గట్టిగా తగిలింది.

మీరంతా ఇంటి పనుల్లో ఉంటే నేను మాత్రం సినిమా తీసుకున్నాను అంటూ వారిని ఎద్దేవ చేస్తున్నట్లుగా వర్మ ట్వీట్‌ చేశాడు.ఈ వర్మ ట్వీట్‌ ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటుంది.

మరో సారి ఆయన ఈ ట్వీట్‌ తో చర్చనీయాంశం అయ్యాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rm Gopal Varma Tweet On Corona Virus Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test