రోజాకు ఆ పదవి డిసైడ్ చేసిన జగన్ ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగానే కాకుండా జగన్ కు అత్యంత సన్నిహితురాలిగా పేరు పొందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మొదటి మంత్రివర్గ విస్తరణ లోనే కీలకమైన పదవి దక్కుతుందని అంతా అంచనా వేశారు.కానీ అనూహ్యంగా సామాజిక వర్గ సమీకరణాలు అడ్డు రావడంతో, జగన్ ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చింది.

 Ap Cm Jagan Mohan Reddy Decided To Give The Cinima Filed Post To Rk Roja, Rk Roj-TeluguStop.com

ఆ తర్వాత ఆమె అసంతృప్తికి గురవ్వడంతో ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ వంటి కీలకమైన పదవిలో జగన్ కూర్చోబెట్టారు.దీంతో ఆమె కాస్త మెత్తబడ్డారు.

కానీ ఆమె మొదటి నుంచి మంత్రి అవ్వాలనే కోరికతో ఉంటూ వచ్చారు.అనేక సందర్భాల్లో తన మనసులో మాటను బయట పెట్టుకున్నారు.

మొదటి విడతలో అవకాశం దక్కకపోయినా, రెండో విడతలో అయినా మంత్రి పదవి వరిస్తుందని ఆమె ఆశలు పెట్టుకున్నారు.కానీ మళ్ళీ సామాజికవర్గాల సమీకరణాల లెక్కల ప్రకారం, బీసీ సామాజికవర్గాలకు మంత్రి పదవులు జగన్ కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు.

కానీ ఎక్కడా తన అసంతృప్తి బయటపడకుండా, ఆమె జాగ్రత్తపడడం వంటి విషయాలు జగన్ వద్దకు చేరడంతో, ఆమెకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.సినీ రంగం నుంచి వచ్చిన రోజాకు ఆ వర్గం వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆమెకు సినీరంగానికి సంబంధించి ప్రభుత్వం తరఫున నియమించే కమిటీ చైర్మన్ గా రోజాను జగన్ ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ శ్రావణ మాసంలో ఆ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.

Telugu Ap Cm Jagan, Jagan Ministers, Rk Roja, Rk Roja Actress, Roja Latest, Ysrc

ఆ కమిటీలో రోజా కింద ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమించబోతున్నట్టు తెలుస్తోంది.టాలీవుడ్ కు చెందిన దర్శక నిర్మాతలు, హీరోలు ఏపీ ఏదైనా షూటింగ్ నిమిత్తం అనుమతి కావాల్సి వస్తే ఈ కమిటీని సంప్రదిస్తే, రోజా నేతృత్వంలో ఉన్న కమిటీ వీటికి అనుమతులు మంజూరు చేసే విధంగా ఆ కమిటీల్లో నియమ నిబంధనలు రూపొందించారట.రోజాకు మంత్రి పదవి ఇవ్వాలని ఉన్నా, సామాజికవర్గాల లెక్కలు సరిపోకపోవడంతో ఆమెకు ఈ విధంగా ప్రాధాన్యమున్న పదవులను కట్టబెడుతూ తగిన న్యాయం జగన్ చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.కాకపోతే ఎన్ని పదవులు తనను వారిస్తున్నా, మంత్రిని కాలేకపోతున్నాను అనే బాధ మాత్రం రోజాను వెంటాడుతోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube