నాగిని డ్యాన్స్ వేసిన బద్ద శత్రువులు కాజల్, అనీ మాస్టర్.. షాక్ లో నెటిజన్లు?

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు కొట్లాడుకుంటారు మళ్ళీ వెంటనే కలిసి పోతూ ఉంటారు.

 Kajal Anee Master Nagin Dance Video Viral Details,  Rj Kajal, Anee Master, Nagin-TeluguStop.com

హౌస్ లో కొట్లాడుకొని బయట కూడా అదే విధంగా ఉంటారు అనుకోవడం పొరపాటే.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో బద్ధ శత్రువులుగా ఉన్న వారు బయటికి రాగానే ఫ్రెండ్స్ లాగా కలిసిపోతూ ఉంటారు.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులను బట్టి కంటెస్టెంట్స్ ప్రవర్తిస్తూ ఉంటారు.

అంతేకానీ హౌస్ లో జరిగిన విషయాలకు వారి వ్యక్తిగత విషయాలకు కంపేర్ చేసుకోరు.

ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో అనీ మాస్టర్, ఆర్ జే కాజల్ మధ్య జరిగిన గొడవలు గురించి మనందరికీ తెలిసిందే.

వారిద్దరి మధ్య గొడవలు ఏవిధంగా ఉండేది అంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వారిద్దరి వ్యవహారం తయారయింది.చాలా విషయాల్లో అనీ మాస్టర్ కాజల్ ని వెక్కిరించిన విషయం అందరికి తెలిసిందే.

అనీ మాస్టర్ కాజల్ ను పదేపదే వెక్కిరిస్తూ నాగిని డాన్స్ అంటూ విసిగించేది.అలా చివరికి బిగ్ బాస్ హౌస్ లో నాగినిగా కాజల్ కి పేరు వచ్చింది.

అలా ఉన్న వారిద్దరూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే అవన్నీ మరిచిపోయారు.ఇదిలా ఉంటే తాజాగా కాజల్ తన యూట్యూబ్ వీడియో కోసం అనీ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వారిద్దరూ కలసి నాగిని స్టెప్పులు వేశారు.బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగినా కూడా బయటకు వచ్చిన అంతా పాజిటివ్ గానే ఉండాలి ఎప్పుడూ ఇలా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే ఉండాలి అని చెబుతూ ఇద్దరు కలిసి నాగిని స్టెప్పులు వేశారు.

ఇది చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు శత్రువులు ఇద్దరూ ఒకటయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube