మంచోడు అంటూనే మసి పూస్తున్నారు!       2018-06-25   22:01:01  IST  Raghu V

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో సామాన్యులకు ఛాన్స్‌ ఇచ్చారు. ముగ్గురు సామాన్యులు సెలబ్రెటీలతో కలిసి హౌస్‌లోకి వెళ్లారు. సెలబ్రెటీలతో సామాన్యులు ఎలా మసుకుంటారో అంటూ అంతా ముందు నుండి భావించారు. అంతా అనుకున్నట్లుగానే బిగ్‌బాస్‌లో సామాన్యులతో సెలబ్రెటీలు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న సెలబ్రెటీలు కూడా స్టార్స్‌ ఏమీ కాదు. అయినా కూడా వారి పద్దతి కాస్త విభిన్నంగా ఉండటంతో పాటు, సామాన్యును చిన్న చూపు చూస్తూ వారిని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు సామాన్యుల్లో సంజన, నూతన్‌ నాయుడులు ఇద్దరు బయటకు వచ్చేశారు. ఇక మిగిలి ఉన్న సామాన్యుడు గణేష్‌ మాత్రమే. ఇతడు కూడా ఈ వారం నామినేట్‌ అయ్యాడు. ఇంటి సభ్యులు ఎక్కువగా నామినేషన్స్‌ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ ఈసారి ఓపెన్‌ నామినేషన్‌ పక్రియను నిర్వహించడం జరిగింది. బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న సగం మంది గణేష్‌ను నామినేట్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే గణేష్‌ను నామినేట్‌ చేసిన ప్రతి ఒక్కరు కూడా అతడు మంచి వాడే కాని, అతడు ఇక్కడ సర్దుబాటు కాలేక పోతున్నాడు అంటూ చెబుతూ మెడలో నామినేటెడ్‌ ట్యాగ్‌ వేశారు.

గణేష్‌ ఎక్కువగా యాక్టివ్‌గా ఉండక పోవడంతో పాటు, ఆయన ఎక్కువగా టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నాడు అనే ఉద్దేశ్యంతో తాము ఇలా నామినేట్‌ చేశాం కాని, అతడు చాలా మంచి వ్యక్తి అని, గణేష్‌ ఈ ఇంటికి సరిపోయే వ్యక్తి కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గణేష్‌లాంటి వ్యక్తి ఈ ఇంట్లో ఉండాలని, అయితే అతడు తనను తాను ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి గణేష్‌ను పలువురు నామినేట్‌ చేయడంతో అతడు మరోసారి నామినేషన్‌ జోన్‌లో పడ్డాడు. ఇప్పటికే రెండు సార్లు నామినేట్‌ అయ్యి, ఎలిమినేషన్‌ నుండి సేఫ్‌ అయిన గణేష్‌ ఈసారి ఖచ్చితంగా ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అంటున్నారు.

ఎక్కువ మంది నామినేట్‌ చేసిన మరో వ్యక్తి కిరీటి. ఈయన గణేష్‌ కంటే వీక్‌ కంటెస్టెంట్‌ అయ్యాడు. కనుక ఈయనకు కూడా ఎలిమినేషన్‌ ఛాన్స్‌ ఉందని, ఎలిమినేషన్స్‌ ఎవరై ఉంటారు అంటూ ఆలోచిస్తున్న సమయంలో ఎక్కువ శాతం మంది కిరీటి లేదా గణేష్‌ అనిపిస్తుందని చెబుతున్నారు. వీరిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అంటూ ఇంటి సభ్యులు కూడా గుసగుసలాడుకుంటున్నారు. నా అంచనా ప్రకారం అయితే కిరీటి ఎలిమినేషన్‌కు ఎక్కువ ఛాన్స్‌ ఉందనిపిస్తుంది. ఎందుకంటే గణేష్‌ను నామినేట్‌ చేసిన అందరు కూడా మంచివాడు అంటూ ఎలిమినేట్‌ చేశారు. అందుకే ప్రేక్షకులు గణేష్‌ను సేఫ్‌ చేసే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లో మూడవ ఎలిమినేషన్‌ ఉంటుంది, మరి అందులో ఎవరు ఉంటారు, ఎవరు పోతారో తేలిపోయే అవకాశం ఉంది.