మూడింటితో రెచ్చిపోతున్న పెళ్లిచూపులు బ్యూటీ  

Ritu Verma Shocks With Three Films In Hand - Telugu Pelli Choopulu, Ritu Verma, Telugu Movie News, Tollywood Gossips

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రీతు వర్మ, ఆ తరువాత తన మ్యాజిక్‌ను చూపించడంలో చాలా నెమ్మదించింది.అడపాదడపా సినిమాలు చేసినా అమ్మడిని పట్టించుకున్న వారు లేరు.

Ritu Verma Shocks With Three Films In Hand

దీంతో ఆమె మెల్లగా తెలుగు సినిమాలకు దూరం అయ్యింది.కాగా తమిళంలో సినిమా అవకాశాలు రావడంతో ఆమె కోలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది.

అయితే ఆమెను తెలుగు ప్రేక్షకులు దాదాపు మర్చిపోయే సమయంలో మళ్లీ వెలుగులోకి వచ్చేసింది.అలా అని ఏదో ఒక సినిమాలో అవకాశం దక్కించుకొని కాదు, ఏకంగా మూడు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ బ్యూటీ.

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న బైలింగ్వెల్ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.అటు నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ చిత్రంలో కూడా రీతు ఛాన్స్ కొట్టేసింది.

తాజాగా మరో యంగ్ హీరో నాగశౌర్య తన నెక్ట్స్ మూవీని ఓ లేడీ డైరెక్టర్‌తో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా రీతు వర్మ అవకాశం దక్కించుకుంది.

మొత్తానికి ఒకేసారి మూడు సినిమాలతో మళ్లీ టాలీవుడ్ జనాలను ఇంప్రెస్ చేసేందుక రీతు వర్మ దూసుకువస్తోంది.మరి ఈ మూడు సినిమాలు అమ్మడికి ఎంతమేర పేరు తీసుకొస్తాయో చూడాలి.

.

#Ritu Verma #Pelli Choopulu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ritu Verma Shocks With Three Films In Hand Related Telugu News,Photos/Pics,Images..