అవకాశాల కోసం గ్లామర్ వైపు అడుగులు వేస్తున్న రీతూ వర్మ.. వైరల్ ఫొటోస్?

ఒకటి.రెండు.

 Ritu Varma Is Taking Steps Towards Glamor For Opportunities Viral Photos Details-TeluguStop.com

సినిమాలతో ఓవర్ నైట్ స్టార్లుగా మారిన కొంతమంది హీరోయిన్లకు ఆ తర్వాత సినిమాలు అస్సలు కలిసి రావడం లేదు.దీంతో అవకాశాలు కూడా రావటం చాలా కష్టంగా ఉంటుంది.

పైగా వారి స్థానంలో కొత్త హీరోయిన్లు వస్తే చాలు ఇక వీరిని పట్టించుకునే నాధుడే లేడని చెప్పాలి.

దీంతో హీరోయిన్లు మరో రంగం వైపు అడుగులు వేయలేని పరిస్థితులకు కూడా ఉన్నాయి.

ఇక ఉన్న రంగంలోనే గట్టిగా ప్రయత్నించాలి అని అవకాశాల కోసం హాట్ గ్లామర్ షో చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది చిన్న హీరోయిన్లు కెరీర్ ముందుకు సాగడం కోసం అందం విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు.

ఇక అందులో ఒకరు రీతూ వర్మ అని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రీతూ వర్మ.

తెలుగు అమ్మాయి అయినా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మంచి మంచి సక్సెస్ లతో పరుగులు తీసింది.

కానీ ఆ తర్వాత ఈ అమ్మడి ఖాతాలో హిట్ అనేది లేకపోయింది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది రీతూ.

తొలిసారిగా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది రీతు వర్మ.అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకోవటంతో.వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి.కేవలం నటిగానే కాకుండా ఈమె మోడల్ గా కూడా చేసింది.అలా రీతు తొలిసారిగా 2013లో విడుదలైన బాద్ షా సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది.

తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో కూడా నటించింది.

అలా.నా రాకుమారుడు, ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించింది.ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది రీతు.అయితే తనకు పెళ్లి చూపులు సినిమా బాగా కలిసి వచ్చింది.ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.అలా ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించింది.

కానీ అంతగా పేరు సంపాదించుకోలేక పోతుంది.

చాలావరకు తెలుగు అమ్మాయి కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మను అంతగా పట్టించుకోవడం లేదు.దీంతో అవకాశాల కోసం, తనపై దర్శక నిర్మాతల దృష్టి పడటం కోసం ఇష్టం లేకున్నా కూడా గ్లామర్ గా తయారవుతూ మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది.నిజానికి రీతూ ఎక్కువగా గ్లామర్ షో చేసినట్లు కనిపించదు.

కానీ అవకాశాల కోసం తప్పదు అన్నట్లుగా మెల్లిమెల్లిగా గ్లామర్ వైపు అడుగులు వేస్తుంది.తాజాగా తన సోషల్ మీడియా లేదు కదా కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో కొన్ని స్టిల్స్ తో గ్లామర్ గానే కనిపించింది.ఇక ఆ ఫోటోలు వైరల్ అవ్వగా.

తన అభిమానులు ఆ ఫోటోలకు లైక్స్ కొడుతున్నారు.మెల్లిమెల్లిగా గ్లామర్ ను పరిచయం చేస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube