సినీ ప్రపంచానికి చెందిన కొందరి అమ్మాయిల ఆలోచనలు ఏంటో అసలు అర్థం కాదు.ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి.
కొన్ని కొన్ని సార్లు ప్రేమించిన అబ్బాయిలను వదిలేసి విడాకులు తీసుకున్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు.అయితే తాజాగా రీతూ చౌదరి కూడా ఏకంగా విడాకులు తీసుకునే హీరోతో పెళ్లికి రెడీ అంటుంది.
ఇంతకు ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు బుల్లితెరకు చెందిన సీరియల్ నటి రీతూ చౌదరి( Serial Actress Rithu Chowdary ) ఒక నటిగా కంటే సోషల్ మీడియాలో చేసే రచ్చతో మరింత పరిచయాన్ని తెచ్చుకుంది.మొదట్లో టిక్ టాక్ లు, షార్ట్ వీడియోలు కూడా చేసి సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది.దాంతో తనకు బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశాలు వచ్చాయి.
అలా తొలిసారిగా గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు( Intiguttu ) వంటి సీరియల్స్ లో కూడా నటించింది.
సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.ఇక ఓసారి కామెడీ షో జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టింది.
ఇక తొలిచూపులతో జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.

కానీ ఇప్పుడు జబర్దస్త్( Jabardasth ) కు దూరంగా ఉంది.అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోలో పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అలా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది. పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్( Rithu Choowdary Hot Photoshoot ) లతో బాగా షో చేస్తుంది.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది.
చాలావరకు తన పెళ్లి గురించే ఎక్కువగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఫాలోవర్స్.

ఇక తన సమాధానాలు వింటే తనకు పెళ్లి( Rithu Chowdary Marriage ) చేసుకునే ఉద్దేశం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది.అయితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చింది.
అయితే ఒక నెటిజన్.నాగచైతన్య( Naga Chaitanya )ను పెళ్లి చేసుకో.
ఆయన కూడా విడాకులు తీసుకునే ఉన్నాడు కదా అనటంతో సెల్ఫీ వీడియో ద్వారా.ఆ అదృష్టం ఉంటే వెంటనే చేసుకుంటాను అని ఏమాత్రం మొహమాటం పడకుండా చెప్పేసింది.
ఇప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ బాగా వైరల్ అవుతుంది.దీంతో కొందరు జనాలు విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్లికి రెడీగా ఉన్నావంటే ఎంత దిగజారిపోయావు అని కామెంట్స్ చేస్తున్నారు.