ఆ మాటకు నా ఇగో బాగా హర్ట్‌ అయ్యింది: రితేష్‌ దేశ్‌ముఖ్

మనలో చాలామంది సోనీ టెలివిజన్ లో ప్రసారమయ్యే ‘ది కపిల్ శర్మ కామెడీ షో’ చూస్తూనే ఉంటాం.ఈ షోకు తాజాగా జెనీలియా డిసుజా, ఆవిడ భర్త రితీష్ దేశ్ ముఖ్ అతిథులుగా వచ్చారు.

 Riteish Deshmukh Reveals He Gets Annoyed When Down South He Is Addressed As Gene-TeluguStop.com

ఈ ప్రోగ్రాం ఆద్యంతం చాలా ఫన్నీగా జరిగింది.అయితే ఈ ప్రోగ్రాంలో రితీష్ దేశ్ ముఖ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అదే ఇదివరకే దేశ్ ముఖ్, జెనీలియా ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్న తర్వాత వారి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకొని ప్రశాంతంగా పిల్లలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే రితేష్ దేశ్ ముఖ్ ఈ షోలో ఓ సంఘటన గురించి తెలుపుతూ… తాను, జెనీలియా బెంగళూరు నగరంలో ఒక సారి క్రికెట్ లీగ్ చూడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ ఇద్దరు క్రికెటర్లు వారిద్దరు గుసగుసలాడుకొని వారు ‘ మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారట.

ఇక అంతే తనకు కోపం వచ్చిందని, అలాగే కొంచెం ఇగో హర్ట్‌ అయిందని రితీష్ దేశ్ ముఖ్ తెలిపారు.దాంతో తాను కోపంగావారితో మాట్లాడుతూ చూడండి ‘ ఇక్కడ నేను జెనీలియా భర్తను.

అయితే మహారాష్ట్రలో ఆమె రితేష్ భార్య ‘ అని తెలిపానని, అయితే ఆ ఇద్దరి క్రికెటర్స్ వెంటనే చూడండి.ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఆమెను రితేష్ దేశ్ ముఖ్ భార్య అని పిలుస్తారు కాకపోతే దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు అని సమాధానం ఇచ్చారని ఆయన చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వేశారు.

ఈ పూర్తి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా సోనీ ఛానల్ వారు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇకపోతే జెనీలియా తన వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.ఇంటి వద్దనే ఉండి తన కుమారులను, భర్తను చూసుకుంటుంది.

ఈ మధ్య కాలంలో మళ్లీ జెనీలియా కాస్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా కొనసాగుతుంది.ఆవిడకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుతూ తన ప్రేక్షకులను ఎంతగానో ఆనందింప చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube