నిత్యం ఇంట్లో ఉంటే కరోనా సోకే ప్రమాదం: నిపుణులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.దీంతో ప్రజలు గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు.

 Corona, Infection, Home, Experts,vitamin D, Staying At Home Continuously Covid I-TeluguStop.com

నిత్యావసరాలకు ఇంట్లో నుంచి ఓ వ్యక్తి బయటకు వెళ్లడం జరిగింది.అయితే ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియ కొనసాగించిన్నప్పటి నుంచి అందరూ బయటకు వస్తున్నారు.

బయట తిరిగి ఇంట్లోకి వచ్చాక జాగ్రత్తలు పాటించకపోయినా, నిత్యం ఇంట్లో ఉండటం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని, అందుకే వీలైనంత వరకు ఆరుబయటకు వస్తుండాలని నిపుణులు పేర్కొన్నారు.

ఉదయం పూట వ్యాయామంతో పాటు కాసేపు సూర్యరశ్మిలో నిలబడాలని పేర్కొన్నారు.సూర్యరశ్మిలో నిలబడటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్-డి పుష్కలంగా లభిస్తుందన్నారు.వీటితో పాటు కరోనా సమయంలో ఏసీలను వినియోగించడం తగ్గించాలని సూచించారు.ఏసీలో వైరస్ ప్రభలే ప్రమాదం అధికంగా ఉంటుందని అన్నారు.

ఆఫీస్ లకు వెళ్లేవారు ఎవరి ఆహారం వాళ్లు తెచ్చుకుని తినడం మేలన్నారు.ఆహారాన్ని పంచుకోవడం ద్వారా కూడా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు.

కారులో ప్రయాణించేటప్పుడు కారు అద్దాలు తెరవాలన్నారు.అద్దాలు మూసివేయడం ద్వారా కూడా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు.

కరోనా లక్షణాలు ఉండి వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఈ సలహాలు పాటించాలని నిపుణులు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube