పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. సామాన్యుని చావుకు వస్తున్నాయా.. ??

దేశంలో కరోనా వచ్చి కొన్ని నెలలు లాక్‌డౌన్ ఉన్నాకూడా ధరలు పెరగలేదు.అసలే ఉన్న ఉద్యోగాలు ఊడి కొందరు.

 Rising, Petrol, Diesel, Prices, Killing, Common Man,latest Viral  News-TeluguStop.com

చాలీచాలని జీతాలతో మరికొందరు జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో సామాన్య జీవి నెత్తిన ఇందన ధరల పిడుగులు వరుసగా పడుతున్నాయి.అసలు దేశంలో ప్రభుత్వాలు పాడేమీద ఉన్నాయా? అనే అనుమానాలు సగటు జీవిలో కలుగుతున్నాయట.

ఇక దేశంలో ఉపాధి అవకాశాలు లేవు, ఉన్న ఉద్యోగులకు కూడా అరకొర జీతాలే.సగటు మానవుని ఆదాయం పెంచడానికి ప్రయత్నించని ప్రభుత్వాలు, జేబులకు మాత్రం చిల్లులు బాగానే పెడుతుంది.

ఈ క్రమంలో పేదవారు ఇలా దోచుకుంటున్న వారిని శాపనార్ధాలు పెడుతున్నారట.

ఇకపోతే ఇందన ధర పెరుగుదల ప్రభావం ప్రతి నిత్యావసరాల మీద పడుతుంది.

దీనివల్ల పేదవారికి రాను రాను గోచీ కూడా మిగిలేలా లేదు.ఇక ఈ పెరుగుదల వల్ల పేదవాడు ప్రతీ రోజు దోపిడికి గురవడం మాత్రం ఖాయం.

ఇదిలా ఉండగా ప‌్ర‌తి రోజూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సామాన్యుల‌కు మ‌రో షాక్ ఇచ్చాయి.

ముంబైలో ఆటో, ట్యాక్సీల ఛార్జీలు పెరిగాయి.ఇప్ప‌టి వ‌ర‌కూ ఆటోల్లో క‌నీస ఛార్జీ రూ.18 గా ఉండ‌గా ఇక నుంచి అది రూ.21కి చేర‌నుంది.ఇక ట్యాక్సీల్లో క‌నీస ఛార్జీ రూ.22 నుంచి రూ.25 కు పెరిగింది.కాగా ముంబైలో ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర రూ.97 మించిపోగా, డీజిల్ రూ.88 దాటింది.మరి ఇలా ప్రజల బ్రతుకులను నరకంగా మారుస్తున్న ప్రభుత్వాలు మేలు చేయకపోయినా ఫర్వాలేదు గానీ కడుపుమీద కొట్టకండని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దండం పెడుతున్నారట.

ఇక ఇన్నాళ్లు సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఈ పరిస్దితి ఇలాగే కొనసాగితే ఆకలితో, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్దితి వస్తుంది.కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని పేదలను కాపాడాలని విన్నవించుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube