యూకే కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ: రిషి సునక్, ప్రీతి పటేల్‌‌‌లను కదిలించని బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించారు.ఈ సందర్భంగా పలువురు మంత్రుల పోర్ట్‌ఫోలియోలు మార్చి మరొకరికి బాధ్యతలు కట్టబెట్టారు.

 Rishi Sunak, Priti Patel Retain Top Jobs As Uk Pm Shuffles Cabinet , Finance Min-TeluguStop.com

కానీ భారత సంతతి మంత్రులు రిషి సునక్, ప్రీతిపటేల్‌లను మాత్రం ఆయన కదిలించలేదు.తమ సమర్ధత, చాకచక్యంతో అనేక క్లిష్ట పరిస్ధితుల్లో వీరద్దరూ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అండగా నిలిచారు.

అందుకే వీరిని యధాతథంగా కొనసాగించారు ప్రధాని.ఆర్ధిక శాఖ మంత్రి రిషి సునక్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు.

డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధాని జాన్సన్‌కు తలలో నాలుకలా వ్యవహరిస్తుంటారు.

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడైన రిషి సునక్.సజిద్ జావిద్ తన పదవికి రాజీనామా చేయడంతో 2020 ఫిబ్రవరిలో బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు.39 ఏళ్ల రిషి తండ్రి పేరు మోసిన డాక్టర్.బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ చదువుకున్నారు.ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ఆ యూనివర్శిటిలో పరిచయమైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేసిన రిషి సునక్.గోల్డ్‌మ్యాన్ శాచ్ కంపెనీలో అనలిస్ట్‌గా సేవలు అందించారు.నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ డైరెక్టర్.2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి.2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఇక గుజరాతీ ఉగాండా సంతతికి చెందిన ప్రీతి పటేల్.2019 జూలై నుంచి హోం కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.థెరెసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రీతికి ఉంది.అయితే రెండేళ్ల క్రితం ఓ వివాదం కారణంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.అప్పుడు అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బ్రిటన్ అందించే ఆర్థిక సహకారానికి సంబంధించిన వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు.

Telugu Britain, Essex, Rishi Sunak, Preeti Patel, Keel, Oxd, Prime Johnson, Prit

లండన్‌లోనే జన్మించిన ప్రీతి .తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్‌.వారు మొదట ఉగాండాలో నివసించేవారు.

అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు.దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు.వైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్‌ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు.20 ఏళ్లు కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు.కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగినిగా సేవలందించారు.1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్‌స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు.ఆ పార్టీ యురోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించింది.డేవిడ్ కేమరూన్ హయాంలో ఏడాదిపాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగకల్పన శాఖలో మంత్రిగా ఆమె పనిచేశారు.

ఇక తాలిబన్లు, ఆఫ్ఘన్ వ్యవహారాలపై నోరు జారిన ఫారిన్, కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ చీఫ్‌గా వున్న రాబ్‌ను తప్పించి అతని స్థానంలో లిజ్ ట్రస్‌ను నియమించారు జాన్సన్.అలాగే విద్యాశాఖ కార్యదర్శి గావిన్ విలియమ్సన్, హౌసింగ్ సెక్రటరీ రాబర్ట్ జెన్‌రిక్‌లను సైతం తప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube