యూకే: బలమైన ఆర్ధిక వ్యవస్థే లక్ష్యం... బడ్జెట్‌ సమర్పణ, కీలక ప్రకటనలు చేసిన రిషి సునక్

కోవిడ్ వైరస్‌ కారణంగా అమెరికా తర్వాత అత్యంత తీవ్రంగా నష్టపోయిన బ్రిటన్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ దేశ ఆర్ధిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్‌ను బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు.

 Rishi Sunak Delivers Autumn Budget For Stronger British Economy , Rishi Sunak ,-TeluguStop.com

మహమ్మారి వల్ల దెబ్బతిన్న యూకే ఆర్ధిక వ్యవస్ధకు బలమైన వృద్ధిని అందిస్తాననని రిషి సునక్ హామీ ఇచ్చారు.ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం వుందని, వచ్చే నెలల్లో గడ్డు పరిస్ధితి ఎదురయ్యే అవకాశం వుందని హెచ్చరిస్తూనే వ్యయ సమీక్షలో భాగంగా 150 బిలియన్ల పెట్టుబడులను ఆయన ఆవిష్కరించారు.

ఈ బడ్జెట్‌లో హాస్పిటాలిటీ పరిశ్రమకు తాత్కాలిక వ్యాపార రేట్ల ఉపశమనం కలిగించడంతో పాటు ఇంధనం, ఆల్కహాల్ సుంకాలను స్తంభింపజేశారు రిషి సునక్.అలాగే ఏప్రిల్ 2022 నుంచి యొక్క జాతీయ జీవన వేతనాన్ని 9.50 పౌండ్లకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.యూకే ఆర్ధిక వ్యవస్థ తమకు పోటీగా వున్న వారి కంటే వేగంగా కోలుకుంటుందని రిషి సునక్ ఆకాంక్షించారు.

బలమైన పబ్లిక్ ఫైనాన్స్, జాతీయ రుణం నియంత్రణలోనే వున్నాయని.ఎక్కువ మంది ఉపాధిలోనే వున్నట్లు ఆయన చెప్పారు.ఉద్యోగాలను సృష్టించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం, ఆరోగ్య సేవల బ్యాక్‌లాగ్‌లను పరిష్కరించడం, వీధుల్లో భారీగా పోలీసు బలగాలను ఉంచడం, కొత్త ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి తాజా బడ్జెట్‌లో రిషి సునక్ పెద్ద పీట వేశారు.

యూకే ట్రెజరీ శాఖ తాజా గణాంకాల ప్రకారం.

వచ్చే ఏడాది ఆరంభం నాటికి మహమ్మారి వెలుగు చూసిన సమయంలో వున్న స్థాయిని చేరుకునే దిశగా ఆర్ధిక వ్యవస్థ పరుగులు తీస్తోందని తెలిపింది.గతంలో అంచనా వేసిన దానిలో సగం కంటే తక్కువగానే నిరుద్యోగం ఉందని ట్రెజరీ శాఖ చెప్పింది.

వైన్లపై డ్యూటీ ప్రీమియం రద్దు, బీర్‌పై మూడు పెన్స్ తగ్గింపు వంటి నిర్ణయాలు జనాదరణ పొందుతాయని రిషి సునక్ భావిస్తున్నారు.గత దశాబ్ధకాలంలో ప్రోసెక్కో వంటి మెరిసే వైన్ల వినియోగం దేశంలో రెట్టింపు అయ్యింది.

ఇంగ్లీష్ స్పార్కింగ్ వైన్ దాదాపు పదిరెట్లు పెరిగింది.

Telugu America, Britain, British Economy, Covid, English Wine, National, Rishi S

ఇక కోవిడ్ సమయంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ హెల్త్ సర్వీస్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారు రిషి సునక్.అత్యవసర పరీక్షలు, విధానాల బ్యాక్‌లాగ్‌లను పరిష్కరించడానికి, డిజిటల్ టెక్నాలజీని ఆధునీకరించడానికి దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం 100 కమ్యూనిటీ డయాగ్నిస్టిక్ సెంటర్లు వున్నాయని ఆయన చెప్పారు.వీటీలో మెరుగైన సౌకర్యాల కల్పన నిమిత్తం రిషి సునక్ 5.9 మిలియన్ పౌండ్లను ప్రకటించారు.విద్యా రంగం విషయానికి వస్తే.విద్యార్ధులు, ఉపాధ్యాయుల కోసం 4.7 బిలియన్లను ఆయన ప్రకటించారు.శ్రామిక శక్తి శిక్షణ, అభివృద్ధి నిమిత్తం 150 మిలియన్ పౌండ్లను రిషి ప్రకటించారు.3,00,000 కుటుంబాలకు సహాయం చేయడానికి సపోర్టింగ్ ఫ్యామిలీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా 200 మిలియన్ల అదనపు పెట్టుబడిని పెడుతున్నట్లు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube