ఐ-ప్యాక్ డైరెక్టర్ వివాహానికి హాజరు కానున్న ఏపీ సీఎం  

Ap Cm Jagan Going To Attend The I-pac Director Rishi Marriage In Luknow - Telugu Cm Jagan, I-pac Director Rishi, I-pac Director Rishi Marriage In Luknow, ఏపీ సీఎం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం లక్నో లో ఒక వివాహవేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ వివాహం ఎవరిదంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ-ప్యాక్) డైరెక్టర్ రుషి ది.

Ap Cm Jagan Going To Attend The I-pac Director Rishi Marriage In Luknow

ఆయన వివాహ వేడుక లక్నో లో జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ వేడుకలో పాల్గొనడానికి వెళుతున్నట్లు సమాచారం.ఈ ఐ-ప్యాక్ వ్యూహ రచనలతోనే గతేడాది ఏపీ లో జగన్ కు చెందిన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

గతఏడాది జరిగిన ఎన్నికల కు వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ-ప్యాక్ సంస్థ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఐ ప్యాక్ తో ఏ పార్టీ అయితే సంబంధాలు పెట్టుకుంటే దాదాపు ఆ పార్టీ 99 శాతం అధికారంలోకి వచ్చినట్లే అన్న సక్సెస్ రేటు ను సాధించింది.

ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ,జేడీయూ,మొన్న వైసీపీ,ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా అధికారంలోకి రావడానికి ఈ ఐ ప్యాక్ సంస్థ వెనక ఉండి నడిపించింది.

దీనితో ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ వ్యూహకర్త గా మరింత డిమాండ్ పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఐ ప్యాక్ తో సంబంధాలను మరింత కొనసాగించాలనే ఉద్దేశ్యం తోనే సీఎం జగన్ ఇలా ఆ సంస్థ డైరెక్టర్ వివాహానికి హాజరవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు