సీబీఐ కొత్త డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లా నియామకం !  

  • కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషికుమార్‌ శుక్లా ఎంపికయ్యారు. 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిషికుమార్‌ శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌ పదవిలో ఆయన కొనసాగనున్నారు. తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్‌. నాగేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

  • Rishi Kumar Sukla Oppointed New Directior Of Cbi-

    Rishi Kumar Sukla Oppointed New Directior Of Cbi

  • శుక్రవారం మోదీ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు సీజే రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిషికుమార్‌ పేరును ఖర్గే వ్యతిరేకించారు.