కరోనా వైరస్ ఎఫెక్ట్ : మద్యం దుకాణాలను తెరవాలంటున్న సీనియర్ హీరో....  

Rishi Kapoor Requesting To The Government For The Open Wine Shops - Telugu Bollywood Star Hero Rishi Kapoor, Rishi Kapoor Requesting To The Government,, Star Hero Rishi Kapoor News, Star Hero Rishi Kapoor Wine Shops News

దేశంలో ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నకారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అత్యవసర సదుపాయాలు మరియు నిత్యవసర సదుపాయాలు మినహాయించి అన్ని సర్వీసులను మూసివేశారు.

 Rishi Kapoor Requesting To The Government For The Open Wine Shops

అంతేగాక ప్రజలను కూడా తాము ఉన్నటువంటి ఇంటిలోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి బయట సంచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

అయితే ఈ లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా మద్యం దుకాణాలను దుకాణ యజమానులు మూసివేశారు.

కరోనా వైరస్ ఎఫెక్ట్ : మద్యం దుకాణాలను తెరవాలంటున్న సీనియర్ హీరో….-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో మందు బాబులు దాదాపుగా వారం రోజుల నుంచి మద్యం చుక్కలు లేక అల్లాడుతున్నారు.అయితే ఇటీవలే ఓ వ్యక్తి ఈ మద్య పానానికి బానిస అయ్యి మద్యం లేకుండా ఉండలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

అయితే తాజాగా ఈ మద్యం దుకాణాల మూసివేతపై బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రిషి కపూర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.

ఇందులో కొంతకాలం పాటు దేశంలో లైసెన్సులు కలిగినటువంటి మద్యం దుకాణాలను తెరవాలని కోరాడు.అయితే ఇందుకు కారణాలు వివరిస్తూ ప్రస్తుతం అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారని దీనివల్ల కొంత ఒత్తిడికి, నిరాశకి లోనవుతున్నారని కాబట్టి ఇలాంటి సమయంలో వారి గురించి ఆలోచించాలని సూచించారు.అంతేగాక తనని తప్పు పట్టవద్దని కోరాడు.

అయితే రిషి కపూర్ చేసినటువంటి ఈ ట్వీట్ కి నెటిజన్లను బాగానే మద్దతు తెలుపుతున్నారు.అంతేకాక ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఉన్నట్లుండి లాక్ డౌన్ పేరుతో అన్ని మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి ప్రభుత్వ అధికారులు కొంత సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rishi Kapoor Requesting To The Government For The Open Wine Shops Related Telugu News,Photos/Pics,Images..