ఆ పరికరంతో ప్రాక్టీస్ సెషన్ లో హల్ చల్ చేసిన రిషబ్ పంత్..!

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత దేశ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ జరుగుతోంది.ఇందులో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు జరిగిన అందులో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవగా.

 Rishabh Pant Enjoyed A Lot In Practice Session With That Device Drone Camera-TeluguStop.com

రెండో మ్యాచ్ లో టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించి మ్యాచ్ ను కైవసం చేసుకుంది.ప్రస్తుతం సిరీస్ 1 – 1 తో సమానంగా ఉంది.

నేటితో మొదలయ్యే మూడు టెస్ట్ కోసం ఇరుజట్లు పూర్తిగా సన్నద్ధమవుతున్నాయి.ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన మోతేరా స్టేడియంలో భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతుంది.

 Rishabh Pant Enjoyed A Lot In Practice Session With That Device Drone Camera-ఆ పరికరంతో ప్రాక్టీస్ సెషన్ లో హల్ చల్ చేసిన రిషబ్ పంత్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగానే ప్రాక్టీస్ స్టేషన్ లో చెమటోడుస్తున్నయి.టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రహానే, రిషబ్ పంత్ తోపాటు ఆటగాళ్ళందరూ చెమటోడుస్తున్నరు.

ఇది ఇలా ఉండగా తాజాగా రిషబ్ పంత్ గ్రౌండ్ లో డ్రోన్ కెమెరాలు తిప్పుతూ తెగ సందడి చేశాడు.ట్రైనింగ్ సమయంలో జట్టు సభ్యులందరూ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో తన డ్రోన్ కెమెరాతో అతడు వీడియోలు తీసి దానిని సోషల్ మీడియాలో అభిమానులకు పంచుకున్నాడు.

అందులో ఈ ప్రాక్టీస్ స్టేషన్ లో తాను కూడా చాలా శ్రమించానని నెట్ ప్రాక్టీస్ ను ఇంకో విధంగా చూడాలనుకుంటే తన కొత్త ఫ్రెండ్ ను కలవండి అని తెలిపాడు.తన కొత్త ఫ్రెండ్ కు స్పైడే అని పేరు పెట్టినట్లు అతడు చెప్పుకొచ్చాడు.

దీంతోపాటు అతడు తీసిన వీడియో ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

ప్రస్తుతం రిషబ్ పంత్ మంచి ఫామ్ లో కనపడుతున్నాడు.ఇది వరకు జరిగిన ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా అతడు ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.నేటి నుంచి జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ లో కూడా తన సత్తా చూపించాలని సిద్ధమవుతున్నాడు.

నేడు జరగబోయే డే అండ్ నైట్ మ్యాచ్లో ఎల్ఈడి లైట్ ల మధ్య గులాబీ బంతితో పోరాడడానికి ఈరోజు ఇరుజట్లు సిద్ధమయ్యాయి.ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో రంగంలోకి దిగుతుందని సమాచారం.

#Match Practice #Motera Stadium #Viral Video #Device #Drone Camera

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు