అయ్యో పాపం మడోన్నా..!

తాజాగా అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మారడోనా గుండె నొప్పితో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈయనకు రెండు వారాల క్రితమే మెదడులో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ ని కూడా చేయించుకున్నారు.

 Rip Madonna Tweets Viral In Social Media, Madonna, Maradona, Rip, Social Media,-TeluguStop.com

ఈయన హఠాత్మరణం తో ఫుట్ బాల్ ప్రేమికులు మొత్తం సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.ఎంతో మంది ఆరాధ్య ఆటగాడైనా ఈ ఫుట్ బాల్ ప్లేయర్ చనిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫుట్ బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అయితే తాజాగా ఈయన చనిపోయిన నేపథ్యంలో ఆయనకు తెలపాల్సిన సంతాపాలు పొరపాటున పాప్ సింగర్ మడోన్నా కు తెలుపుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
సోషల్ మీడియాలో చాలా మంది పొరపాటుగా మారడోనా కు తెలపాల్సిన సంతాపాన్ని పాప్ సింగర్ మడోన్నా పేరిట పెద్దఎత్తున ట్వీట్స్ చేస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.దీంతో ఈ ఐకానిక్ సింగర్ పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిపోయింది.

సంతాపం తెలపాలని తొందరలో చాలామంది పాప్ స్టార్ మడోన్నా కు రెస్ట్ ఇన్ పీస్ అంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు వైరల్ గా మారాయి.దీంతో మడోన్నా కు ప్రస్తుతం ఏమి చేయాలో అర్థం కావట్లేదు.

ఫుడ్ బాల్ దిగ్గజాల గాడు మారడోనా అలాగే ఈవిడ పేరు దగ్గర దగ్గరగా ఉండడంతో సోషల్ మీడియాలో కొందరు తొందర్లో మారడోనా పేరు బదులు మడోన్నా తో ట్యాగ్ చేయడంతో ఈ కన్ఫ్యూజన్ ఎదురైంది.

Telugu Maradona, Madonna-Latest News - Telugu

ఇక మారడోనా విషయానికి వస్తే.ఈయన అర్జెంటినా దేశానికి ఒంటిచేత్తో ఎన్నో ట్రోఫీలను అందించగలిగారు.ఈయన మొత్తం నాలుగు సార్లు ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో పాల్గొన్నాడు.1986 లో అర్జెంటీనా దేశం ఫుట్ బాల్ కప్ గెలవడంలో మారడోనా అందరికంటే ఎక్కువగా కీలకపాత్ర వహించాడు.ఆ టోర్నీతో ప్రపంచవ్యాప్తంగా మారడోనా పేరు నామస్మరణ జరిగింది.

ఆ తర్వాత జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్ లో కూడా అర్జెంటీనా దేశాన్ని ఫైనల్ కు తీసుక వెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించాడు.చివరిగా ఆయన 1997లో తన ఫుట్ బాల్ కెరియర్ కు స్వస్తి చెప్పాడు.

ఆ తర్వాత 2008లో అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు కోచ్ గా ఆయన నియమితులయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube