భైంసాలో మరోసారి చెలరేగిన అల్లర్లు.. మీడియా మిత్రులకు సైతం గాయాలు.. ?

తెలంగాణ నిర్మల్‌ జిల్లాలోని భైంసా పట్టణంలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణల నిప్పులు రాజుకున్నాయి.అల్లరి మూకల స్వైర విహారంతో భైంసా పట్టణం ఉలిక్కిపడింది.

 Riots Erupt In Bhainsa Media Friends Also Injured, Telangana, Nirmal, Bhainsa, R-TeluguStop.com

పట్టణంలోని బట్టి గళ్లీ ‌ప్రాంతంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గంపై మరొక వర్గానికి చెందిన వారు పరస్ఫరం రాళ్లు రువ్వుకున్నారు.కాగా ఈ దాడిలో చాలా మందికి గాయాపడినట్లు సమాచారం.

ఇక ఈ దాడిలో ముగ్గురు పోలీసులతో పాటుగా మీడియా మిత్రులకు సైతం గాయాలైనట్లు వార్తలు వెలువడుతున్నాయి.అదీగాక పలు వాహనాలు, దుకాణాలు దగ్ధమయ్యాయి.పోలీసుల అప్రమత్తతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.జుల్ఫీకర్ గల్లీ, గణేశ్ నగర్, కుబీర్ రోడ్, బస్టాండ్ ఏరియా, కొర్భా గల్లీ, మేదరి గల్లీ వంటి పలు ప్రాంతాల్లో పోలీసుల పికెటింగ్ కొనసాగుతోందని, ఈ అల్లర్ల నేపధ్యంలో ఇంటర్ నెట్ సేవలను కూడా నిలిపివేశారని వెల్లడవుతుంది.

ఇకపోతే భైంసాలో 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తుండగా, దాదాపు 50 మంది ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.ఇక ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు 100 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, అలాగే పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube