బీజేపీలో మొదలైన లుకలుకలు... అధ్యక్షుని వద్దకు చేరుతున్న పంచాయితీ

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది.మొన్నటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎటువంటి పార్టీలేని పరిస్థితులలో బీజేపీ చేసిన పోరాటాలు కొంత మేర ప్రజల్లో గుర్తింపు పొందాయి.

 Riots Between Bjp Leaders Panchayat Bandi Sanjay-TeluguStop.com

ఇక వాటి ఫలితంగానే దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించడం, జీహెచ్ఎంసీ లో అత్యధిక స్థానాలు గెలవడంతో ఇక ఒక్కసారిగా అందరి చూపు బీజేపీ వైపు పడింది.ఇక అప్పటి నుండి రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇక బీజేపీ  బలపడాలనే ఉద్దేశ్యంతో పాత, కొత్త నేతలను బీజేపీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు అసలు ఖత మొదలైంది.

 Riots Between Bjp Leaders Panchayat Bandi Sanjay-బీజేపీలో మొదలైన లుకలుకలు… అధ్యక్షుని వద్దకు చేరుతున్న పంచాయితీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు పాత కొత్త నేతల మధ్య సఖ్యత కుదరక, క్షేత్ర స్థాయిలో విభేదాలు వస్తుండటంతో ఇక పంచాయితీ అధ్యక్షులు బండి సంజయ్ వద్దకు చేరింది.ఇక ఇరువురికీ సర్ధి చెప్పేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నా విభేదాలు మాత్రం సమసిపోయినట్టు  కనిపించడం లేదని బీజేపీ పార్టీలోని అంతర్గతంగా వ్యాఖ్యానించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే ఇది ఇప్పుడు మనమందరం పోరాడాల్సిన సమయం అని, ఈ సమయంలో విభేదాలు సృష్టించుకోవడం ద్వారా బీజేపీకి నష్టం జరుగుతుందని సీనియర్ నాయకులు సైతం క్షేత్ర స్థాయి నాయకులకు వివరిస్తున్న  పరిస్థితి ఉంది.ప్రతి పార్టీలో ఇవి సహజమే అయినా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ లాంటి పార్టీకి కొంత అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.

#Panchayat #BJPPresident #Senior Leaders #Conflicts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు