ఈ ద్రావణం పుక్కిలిస్తే కరోనా వైరస్ ఖతం!  

Rinsing Mouth With Salt Water Can kills Coronavirus, Coronavirus, Iodine, Salt water, Russia Vaccine, Side effects - Telugu America Scientists, Corona Virus, Coronavirus, Iodine, Iodine Solution, Rinsing Mouth With Salt Water Can Kills Coronavirus, Russia Vaccine, Salt Water, Side Effects, World Health Organization

గడిచిన కొన్ని నెలలుగా దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతూ ప్రజల్లో భయాందోళనను తీవ్రస్థాయిలో పెంచుతున్న సంగతి తెలిసిందే.శాస్త్రవేత్తలు వైరస్ గురించి, వైరస్ ను కట్టడి చేసే మార్గాల గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు.

TeluguStop.com - Rinsing Mouth Salt Water Coronavirus

శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు కొంతమేర కరోనా కట్టడిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో అయోడిన్ తో నోటిని పుక్కిలిస్తే నోట్లోని కరోనాను కట్టడి చేయవచ్చని తేలింది.

గతంలోనే అయోడిన్ తో నోట్లోని కరోనాను అంతం చేయవచ్చని వార్తలు వచ్చినా పలువురు శాస్త్రవేత్తలు ఆ వార్తలను తోసిపుచ్చారు.అయితే యూఎస్ యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఎవరైతే అయోడిన్ ను ఉపయోగించి నోటిని శుభ్రం చేసుకుంటారో వారికి కరోనా సంక్రమించే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.

TeluguStop.com - ఈ ద్రావణం పుక్కిలిస్తే కరోనా వైరస్ ఖతం-General-Telugu-Telugu Tollywood Photo Image

గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వాదనను తోసిపుచ్చినా యూఎస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం పూర్తిస్థాయిలో ప్రయోగాలు చేసే ఈ విషయాలను వెల్లడిస్తున్నామని చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు వేర్వేరు సాంద్రత కలిగిన పోవిడోన్ అయోడిన్ ను కరోనా నమూనాలపై ఉంచి ఈ పరిశోధనలు చేశారు.15 సెకన్ల పాటు అయోడిన్ తో నోటిని పుక్కిలిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.కరోనా వైరస్ వ్యాధి కారకాలపై పోవిడోక్ అయోడిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పరిశోధనల ద్వారా మంచి ఫలితాలను సాధించామని పేర్కొన్నారు.

మరోవైపు రష్యా కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.దీంతో సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ కోసం మరికొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.2020 చివరినాటికి 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

#WorldHealth #Iodine #Iodine Solution #Coronavirus #Russia Vaccine

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rinsing Mouth Salt Water Coronavirus Related Telugu News,Photos/Pics,Images..