వాస్తు స‌ల‌హాలు: ఏ దిక్కున కూర్చుని ఆహారం తిన‌డం శ్రేయ‌స్క‌ర‌మో మీకు తెలుసా?

మన దైనందిన జీవితానికి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి వాస్తు శాస్త్రంలో అనేక సూచనలు ఇవ్వబడ్డాయి.విజయ వంతమైన జీవితాన్ని కోరుకునేవారు వీటిని అవలంబించవచ్చు.

 Right Direction For Eating Food , Right Direction , Eating Food , Architecture-TeluguStop.com

దిశల గురించి వాస్తులో వివరంగా తెలియజేశారు.ఆయా దిశల దేవతలు, వివిధ రకాల శక్తులకు సంబంధించినవని వాస్తుశాస్త్రం చెబుతోంది.

ఏ దిక్కుకు ఎదురుగా భోజనం చేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు దక్షిణ దిక్కుకు తిరిగి ఆహారం తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి.

దక్షిణ దిక్కును యమరాజు దిశగా పరిగణిస్తారు.యమరాజు మృత్యుదేవత.

దక్షిణాభి ముఖంగా ఆహారం తీసుకుంటే ప్రాణహాని కలుగుతుంది.మిమ్మల్ని అనేక రకాల సమస్యలు చుట్టుముట్టవచ్చు.

తూర్పు లేదా ఈశాన్య ముఖంగా కూర్చుని ఆహారం తీసుకోవడం ఉత్తమం.ఇలా చేయడం ద్వారా సదరు వ్యక్తి ఆహారం నుండి పూర్తి శక్తిని పొందుతాడు.

తూర్పు ముఖంగా ఆహారం తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుంది.జీర్ణశక్తి పెరుగుతుంది, దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది.

దీనిని ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు.విద్యార్ధులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఉత్తరాభి ముఖంగా ఆహారం తీసుకోవాలి.

కెరీర్ తొలిదశలో ఉన్నవారు కూడా ఈ దిశలోనే ఆహారం తీసుకోవాలి.ఈ దిశ సంపద, జ్ఞానం మరియు ఆధ్యాత్మికతకు దిశగా పరిగణించ బడుతుంది.

పశ్చిమ దిశను లాభాల దిశగా పరిగణిస్తారు.వ్యాపారం చేసేవారు లేదా ఉద్యోగంలో ఉన్నవారు లేదా రచనలు, విద్య, పరిశోధన మొదలైన పనులతో సంబంధం ఉన్నవారు కూడా ఈ దిశలో కూర్చుని ఆహారం తీసుకోవాలి.

మన ఆరోగ్యం ఆహారంతో ముడిపడి ఉంటుంది.ఆహారాన్ని సరైన దిశలో తయారు చేసి, సరైన దిశలో కూర్చొని తింటే, దాని నుండి సరైన ఆరోగ్యం పొందవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube