కత్తిలో సీన్లు కొట్టేసి ఖైదీలో అతికించేసారుగా!   Ridiculous Remake By Chiranjeevi – Even Frames Are Stolen     2017-01-09   00:46:26  IST  Raghu V

రిమేక్ సినిమా అంటే తీసిన కథనే మళ్ళీ తియడం అని మనకు తెలిసిందే. ఇతర భాషలో హిట్ అయిన చిత్రాల్ని, సెట్ అయితే పూర్తిగా కాపి చేయడం, లేదంటే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చిన్నచిన్న మార్పులు చేయడం మనకు తెలుసు. ఒక్కోసారి ఒరిజినల్ సినిమాలో వాడిన నేపథ్య సంగీతాన్ని, పాటల్ని కూడా వాడేస్తుంటారు (తెలుగు ప్రేమమ్). ఇప్పటివరకు రిమేక్ సినిమాలు అంటే మనకు తెలిసిన విషయాలు ఇవి. కాని ఇప్పుడు తమిళ సినిమా కత్తిని రిమేక్ చేసిన ఖైదీనం 150 యూనిట్ మరో విచిత్రమైన పని చేసింది.

ఈ ఫోటోలు చూస్తే మీకు ఏం అర్థం అవుతోంది? అర్థం అయితే ఫర్వాలేదు కాని, అర్థం కాకపోతే ఏం చేసారో చెప్తున్నాం చూడండి. ఖైదీనం 150 చిత్రంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించలేదు .. కత్తి కోసం తీసిన సీన్ ని ఇక్కడ అతికించేసారు. కాకపోతే, డిఐ వర్క్ లో కలరింగ్ మార్చేసారు అంతే.

- నమ్మబుద్ధి కాకపోతే ఈ ఫోటోల్ని జాగ్రత్తగా గమనించండి. లికా ప్రొడక్షన్స్ వాటర్ మార్క్ తో ఉన్నవి “కత్తి” షాట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ వాటర్ మార్క్ తో ఉన్నవి ఖైదీ నం 150 షాట్స్. ఫ్రేమ్ లో చిన్న వస్తువు అయినా తేడాగా ఉందా? లేదు కదా! నటులు కనిపించని షాట్స్ ని మళ్ళీ తీయడం ఎందుకు అనవసరంగా ఖర్చు చేయాలి అని అనుకున్నారేమో, కత్తి చిత్రంలో షాట్స్ ని తీసుకొచ్చి ఖైదీనం 150 సినిమాలో అంటించేసారు. ఎన్ని తెలివితేటలో!