దారుణం: వాడేసిన మాస్కులతో బెడ్ల తయారీ..!

ప్రపంచంలో రోజురోజుకీ దుర్మార్గులు ఎక్కువైపోతున్నారన్న పనికి ఈ ఘోరం తార్కాణంగా నిలుస్తుంది.ప్రపంచంలో కల్తీ కి ఏది అనర్హం కాదు అన్నట్లుగా.

 Ridiculous Persons Are Making Beds Out Of Used Corona Masks In Maharashtra, Mask-TeluguStop.com

తినేది, వండేది.ఇలా ఏదైనా కల్తీ చేసి కాసులు సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే విధంగా ఎంతోమంది దుర్మార్గులు అనేక నీచమైన కార్యకలాపాలు చేస్తున్నారు.

వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా బ్రతికేస్తున్నారు కొందరు దుర్మార్గులు.గత సంవత్సరం కరోనా వైరస్ ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ అంటూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది.అయితే సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషి ముఖానికి మాస్కులతో ఉంటూ గడిపేయడంతో వారు వాడేసిన మాస్కులు ప్రపంచంలో ప్రతిచోట పెద్ద దిబ్బలుగా మారిపోతున్నాయి.

ఇకపోతే సరిగ్గా ఇదే విషయాన్ని కేటుగాళ్లు గ్రహించారు.భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొందరు దుర్మార్గులు అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో మాస్కులు వినియోగం అధికంగా ఉన్న కారణంతో అక్కడ వాడి పడేసిన మాస్కులతో పరుపులను తయారు చేసి కొందరు విక్రయించేందుకు తెరలేపారు.

అయితే ఈ తతంగాన్ని మొత్తం ఒక్క ఫోన్ కాల్ తో పోలీసులకు విషయం తెలియడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని నిర్వహించబోయే ప్రక్రియను చూసి పోలీసులు అవాక్కయ్యారు.మామూలుగా పరుపుల తయారీలో గుడ్డ, దూది, స్పాంజి లాంటి వాటిని ముక్కలుగా చేసి పరుపులు తయారుచేయడం చూస్తూ ఉంటాం.

అయితే వీరు మాత్రం ప్రజలు వాడి పారేసిన మాస్కులను సేకరించి వాటిని ముక్కలుగా చేసి వాటితో పరుపులను చేసేస్తున్నారు.

Telugu Beds, Corona Wave, Covid, Maharashtra, Maharastra, Corona Masks-Latest Ne

అయితే ఓ పేరు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ సహాయంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ మాస్కుల గుట్టును బయటకి తెచ్చారు.దీంతో మనుషులు వాడి పడేసిన మాస్కుల గుట్టలను సీజ్ చేసి వెంటనే వాటిని తగులబెట్టేశారు.కొన్ని లక్షల పనికిరాని మాస్క్ లను సేకరించిన ఈ ముఠా గత కొద్ది రోజుల నుండి ఇలా తయారు చేయడం మొదలు పెట్టింది.

ముఖ్యంగా ఈ వేస్ట్ మాస్కులు కరోనా పేషెంట్లు వాడినవి.అలాగే కరోనా ఆసుపత్రుల నుండి సేకరించిన మాస్క్ లు ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున భయభ్రాంతులకు లోనవుతున్నారు.

మనం జీవిస్తున్న సమాజంలో ఇంతటి నీచులు కూడా జీవిస్తున్నారా అంటూ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.వెంటనే ఇటువంటి దుర్మార్గులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆ ప్రాంత స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube