వినూత్న పనిష్మెంట్: హెల్మెట్ పెట్టుకోలేదా అయితే వ్యాసం రాయాల్సిందే

హెల్మెట్ కి వ్యాసం కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా నిజంగా హెల్మెట్ లేకుండా పట్టుబడిన ద్విచక్ర వాహనదారులకు పెనాల్టీ విధించకుండా వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.

 Riderswithout Helmets Asked To Write Essay In Bhopal-TeluguStop.com

డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ సంక్షిప్త వ్యాసం రాయమని అడుగుతున్నారట.ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారట.

గత ఆరు రోజులలో రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా భోపాల్ లో 150 మందికి పైగా హెల్మెట్ నిబంధనలను ఉల్లఘించారు.దీనితో వినూత్నంగా ఆలోచించిన ట్రాఫిక్ పోలీసులు వారందరి చేత 100 పదాల వ్యాసం రాయించారట.

రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ లేకుండా దొరికిన ద్విచక్ర వాహనదారులు ఈ అవసరమైన భద్రతా నిబంధనను ఎందుకు ఉల్లంఘిస్తున్నారో వివరిస్తూ 100 పదాలలో ఒక వ్యాసం రాయాలి అని పోలీసు అధికారులు తెలిపారు.

Telugu Bhopal Trafic, Bike, Safety Bike, Helmetswrite, Wheelers, Write Essay-Gen

రైడర్స్ రక్షణ కోసం హెల్మెట్లు చాలా అవసరం అని అలాంటి హెల్మెట్ పెట్టుకొని వారికి పోలీసులు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.రహదారి భద్రతా వారం (జనవరి 11 నుండి 17 వరకు) ముగిసిన తర్వాత కూడా ఈ పధ్ధతి కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube