సమ్మర్‌ స్పెషల్‌ వీడియో : రోడ్డు మీద పోతున్న వారు చల్లబడేందుకు ఇతడు ఏం చేస్తున్నాడో చూడండి  

Riders Take Road Shower-rajasthan,road Shower,voulnteers,ఎండల్లో,చలివేంద్రాలు

గ్లోబల్‌ వార్మింగ్‌ అంటే ఏంటో అనుకుంటాం, దాని గురించి శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద పాఠాలు చెబుతూ ఉంటే బోరింగ్‌ గా ఫీల్‌ అవుతూ ఉంటాం. మనకెందుకులే అని వదిలేస్తాం. అలా వదిలేసిన కారణంగా సంవత్సరం సంవత్సరంకు ఎండలు మండి పోతున్నాయి..

సమ్మర్‌ స్పెషల్‌ వీడియో : రోడ్డు మీద పోతున్న వారు చల్లబడేందుకు ఇతడు ఏం చేస్తున్నాడో చూడండి-Riders Take Road Shower

ఈ సంవత్సరం ఏప్రిల్‌ చివరి వరకు నమోదు అయిన ఉష్ణోగ్రతలు చూస్తే మతి పోతుంది. ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దక్షిణ భారతంతో పాటు ఉత్తర భారతంలో కూడా విపరీతమైన ఎండలకు జనాలు చచ్చి పోతున్నారు.ఎండల నుండి ఉపశమనం పొందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఎండల్లో తిరిగే వారి కోసం కొందరు మంచి వారు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మరి కొందరు చలువ రూంలు ఏర్పాట్లు చేయడం చేస్తారు. ఇంకొందరు కాస్త ఖరీదు అయిన కూడా లస్సీ వంటివి రోడ్డు పక్కన పెట్టి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అయితే రాజస్థాన్‌లోని ఒక ప్రాంతంకు చెందిన ఈ వ్యక్తి చేస్తున్న పని చాలా గమ్మత్తుగా ఉంటుంది.

మద్యాహ్నం 12 నుండి సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు రోడ్డు మీద వెళ్లే వారిని చల్లబర్చేందుకు తన వద్ద ఉన్న పంపుతో నీటిని జల్లుతున్నాడు.ఎవరైతే సుదూర ప్రాంతం నుండి వచ్చి, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందో వారు అక్కడ ఆగిన వెంటనే మనోడు నీటిని జల్లుతాడు. కొందరు బండి దిగి కొద్ది సమయం నీటిలో తడిచి సేద తీరి పోతే, మరి కొందరు మాత్రం బండిపై ఉండి కాస్త అటు ఇటుగా తడిచి అక్కడ నుండి వెళ్తారు. ఈ పద్దతి చాలా బాగుందని స్థానికులు అంటున్నారు.

ఎండకాలం ఇబ్బంది పడకుండా ఇలా నీటిని ఏర్పాటు చేసినట్లుగా వారు చెబుతున్నారు. అయితే బాగా ఎండలో నీటితో తడిచి, మళ్లీ ఎండకు వెళ్తే వేడి చేస్తుందని కొందరు పెద్దలు అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజమో ఈ నీటిలో తడిచిన వారే చెప్పాలి.