బరిలో ఉన్న రాజకీయ శ్రీమంతులు వీరే !

అసలు ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి… ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లు కావాల్సిందే.చేతిలో డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి దిగడం అసాధ్యం అన్నట్టుగానే ఇప్పుడు పరిస్థితి ఉంది.

 Richest Candidates At Telangana Asembly Constences-TeluguStop.com

తాజాగా తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్స్ వేసిన అభ్యర్థుల వివరాలు .వారి ఆస్తిపాస్తులు చూస్తే దిమ్మతిరగాల్సిందే.ఇక్కడ నామినేషన్ ప్రక్రియ సోమవారంతో (నవంబరు 19)తో ముగిసింది.నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబరు 22తో ముగియనుంది.అయితే నామినేషన్ వేసే క్రమంలో అభ్యర్థులు తమ ఆస్తులకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

వందల కోట్ల ఆస్తులున్న శ్రీమంతుల జాబితాలో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు.ఆ తర్వాతి స్థానంలో నాగర్ కర్నూలు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.ఆ తర్వాతి స్థానాల్లో మంజీర కన్‌స్ట్రక్షన్స్ ఎండీ, శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి యోగానంద్; ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నిలిచారు.

* వీరి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ రూ.314,31,70,406

మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ రూ.161,27,26,168

కె.అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ రూ.151,13,99,281

యోగానంద్ బీజేపీ రూ.146,67,57,584

నామా నాగేశ్వరరావు టీడీపీ) రూ.110,01,80,475

* రూ.50 కోట్లకు మించి ఆస్తులున్న అభ్యర్థులు.

కుటుంబ ఆస్తులు రూ.50 కోట్లకు మించి ఉన్న అభ్యర్థుల్లో నారాయణపేట టీఆర్‌ఎస్ రాజేందర్ రెడ్డి అభ్యర్థి మొదటి స్థానంలో ఉండగా.రెండు, మూడు స్థానాల్లో బీజేపీకి చెందిన అభ్యర్థులు అమరేందర్ రెడ్డి (వనపర్తి), అమర్ సింగ్ (కార్వాన్) నిలిచారు.ఈ జాబితాలో చివరిస్థానంలో మక్తల్ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి నిలిచారు.

అభ్యర్థి పార్టీ ఆస్తులు

ఉపేందర్ రెడ్డి (పాలేరు) కాంగ్రెస్ రూ.91.03 కోట్లు

రాజేందర్ రెడ్డి (నారాయణపేట) టీఆర్ఎస్ రూ.66.21 కోట్లు

అమరేందర్ రెడ్డి (వనపర్తి) బీజేపీ రూ.63.13 కోట్లు

అమర్ సింగ్ (కార్వాన్) బీజేపీ రూ.54.28 కోట్లు

పొన్నాల లక్ష్మయ్య (జనగాం) కాంగ్రెస్ రూ.64.13 కోట్లు

వి.ఆనంద ప్రసాద్ (శేరిలింగంపల్లి) టీడీపీ రూ.62.09 కోట్లు

వీరేందర్ గౌడ్ (ఉప్పల్) టీడీపీ రూ.57.32 కోట్లు

కొత్తకోట దయాకర్ రెడ్డి (మక్తల్) టీడీపీ రూ.50.21 కోట్లు


* రూ.10 – రూ.50 కోట్ల మధ్య ఆస్తులున్న అభ్యర్థుల సంఖ్య పార్టీల వారీగా.టీఆర్ఎస్ నుంచి 31 మంది, ప్రజాకూటమి నుంచి 29 మంది, బీజేపీ నుంచి 10 మంది అభ్యర్థులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube