పాత ఫోటోలతో 'మిర్చి' హీరోయిన్‌ ను ఇబ్బంది పెడుతున్నారట

మిరపకాయ, మిర్చి సినిమాలతో పాటు మరి కొన్ని తెలుగు సినిమాలు కొన్ని తమిళ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ.మంచి ఫామ్ లో ఉండగానే అమెరికాకు చదువు కోసం అంటూ ఆమె వెళ్లి పోయిన విషయం తెలిసిందే.

 Richa Gangopadhyay Fire On Netizens Who Post Her Photos In Social Media Mirapaka-TeluguStop.com

మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ వస్తుందని అంతా ఆశించారు.కానీ అక్కడే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

ఈమె తెలుగు సినిమాలకు దూరమై ఎనిమిదేళ్లయింది.అయినా ప్రేక్షకులు ఆమెను మరిచి పోలేక పోతున్నారు.

ఇటీవల ఆమెకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఆమెను గుర్తు చేసుకున్నారు.తన ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేస్తున్న అభిమానుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

పెళ్లికి ముందు కొన్ని చోట్ల కొన్ని సార్లు బోల్డ్ గా కనిపించేందుకు రీచా అప్పట్లో ఓకే చెప్పింది.

సినిమాల కోసం కొన్నింట్లో రొమాంటిక్‌ గా కూడా నటించింది.

కానీ ఇప్పుడు అదే ఆమెకు ఈ కాస్త ఇబ్బందిగా మారినట్లుగా అనిపిస్తుంది.భర్త ముందు అలాంటి ఫోటోల వల్ల ఆమె ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది.

హాట్‌ గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం వల్ల ఆమె ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతున్నట్లు గా గుసగుసలు వినిపిస్తున్నాయి.అందుకే తన ఫోటోలను షేర్ చేస్తూ పదే పదే తన సినిమాల్లో ఎప్పుడూ నటిస్తారు అంటూ అడిగే వారికి సున్నితంగా క్లాస్ పీకింది.

మీకు నన్ను ఫాలో అవ్వడం తప్ప వేరే పని లేదా అంటూ అసహనం తో వ్యాఖ్యలు చేసింది. వరుస ట్వీట్స్‌ తో ఆమె చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ వచ్చింది.

పెళ్లి అయిన ఆమె గురించి ఇకపై ఎవరు అలాంటి ఫొటోలు షేర్‌ చేయడం కరెక్ట్‌ కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపై ఆయినా మీడియా మరియు నెటిజెన్స్ ఆమె ఫోటోలను మరియు వీడియోలను వైరల్ చేయడం ఆపేస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube