లీడర్, మిరపకాయ్ హీరోయిన్ 'రిచా గంగోపాధ్యాయ్' గుర్తుందా.? ఇప్పుడు ఎవర్ని పెళ్లిచేసుకోబోతుంది అంటే.?

ఒక ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తున్నవాళ్లు ఇండస్ట్రీలో చాలామంది.అవకాశం ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో ఎవరికి తెలియదు.

 Richa Gangopadhyay Engaged To Boyfriend Joe Lingalla1-TeluguStop.com

అలాంటి పరిస్థితిల్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వాటి ఫలితంగా మరిన్ని అవకాశాలను రాబట్టుకోవాలనుకుంటారు చాలామంది.కానీ హీరొయిన్స్ కి ఆ పరిస్థితి ఉండదు.

పెళ్లి ,పిల్లలు అయినా లేదంటే ఒక ప్లాప్ వచ్చినా కూడా అంతే సంగతి అవకాశాలు సన్నగిల్లుతాయి.కానీ రిచా గంగోపాద్యాయ్ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతుంది.

రిచా గంగోపాధ్యాయ్.లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ కథానాయిక.ఆ సినిమాలో రాణా సరసన నటించి మంచి మార్కులే కొట్టేసింది.శేఖర్ కమ్ముల సినిమాలో అవకాశం అంటే మామూలు విషయం కాదు.

ఆ సినిమా తర్వాత పెద్ద హీరోలు ప్రభాస్,రవితేజ,నాగార్జున,వెంకటేష్ ల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది రిచా .మిర్చి, మిరపకాయ్,భాయ్,నాగవల్లి సినిమాల్లో మంచి అవకాశాలే వచ్చాయి వాటిని సద్వినియోగ పరుచుకుంది.

కానీ ఒకసారిగా వస్తున్న అవకాశాలను పక్కన పెట్టేసి పై చదువుల కోసం అని అమెరికా వెళ్లిపోయింది.టైం బాగున్నప్పుడు నాలుగు సినిమాలు వెనకేసుకోవాలనుకుంటారు సినిమావాళ్లు కానీ ఈమె మాత్రం విభిన్నంగా అన్ని వదిలేసింది.అయినప్పటికి అభిమానులు ఈమెని మర్చిపోలేదు.అప్పుడప్పడుు తలుచుకుంటూనే ఉన్నారు.మళ్లీ నటిస్తే బాగున్ను అనుకుంటున్నారు.

తాజాగా త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఓ శుభవార్త‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

త‌న‌కు బిజినెస్ స్కూల్‌లో ప‌రిచ‌య‌మైన జోయ్ అనే వ్య‌క్తిని పెళ్లిచేసుకోబోతున్న‌ట్టు తెలియ‌జేసింది.`నాకు ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది అనే విష‌యాన్ని మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను.రెండేళ్ల‌క్రితం జోయ్‌, నేను బిజినెస్ స్కూల్‌లో క‌లిశాం.నా జీవితంలో త‌ర్వాతి ద‌శ గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా.

పెళ్లి ముహూర్తం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు` అని రిచా ట్వీట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube