ఎన్నారైలు భారత పౌరసత్వం వదులుకోవడానికి కారణాలు ఇవేనట..!!!

ఏ దేశంలో ఉన్నా ఎలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే భారత దేశంలో పుట్టిన ఎవరైనా దేశ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు.అలాంటిది కేంద్రం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 6 లక్షల మంది భారతీయులు మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారట.

 Rich Indians Looking To Leave India Country Why  , Indians, Golden Visa, Dual C-TeluguStop.com

ఈ విషయం తెలిసిన తరువాత భారతీయులు ఎంతో మంది షాక్ కు గురయ్యారు.అసలు అంత మంది ఎందుకు మన దేశ పౌరసత్వం వదులుకోవాలని అనుకున్నారని ఆలోచించారు.

అయితే ఇదే విషయంపై నిపుణులు ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు.

పలు దేశాలు తమ దేశాభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గోల్డెన్ వీసాలను అందిస్తుంటాయి.

ఈ వీసా ద్వారా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీలు కూడా కల్పిస్తాయి.ఈ వీసా పొందే వారికి ఆయా దేశాల శాశ్వత సభ్యత్వం కూడా కలుగుతుంది.

ఈ వీసాలకు భారత సంతతి సంపన్నులు ఎక్కువగా వీసా పొందేందుకు ఇష్టపడుతున్నారు.కాగా భారత్ లో డ్యుయల్ సిటిజన్ షిప్ సౌకర్యం లేదు.

విదేశీ పౌరసత్వం కోరుకునే వాళ్ళు తప్పకుండా భారత పౌరసత్వం వదులుకోవాల్సిందే.

అయితే ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందే అవకాశం ఇచ్చింది.

ఈ గుర్తింపు ప్రకారం భారత్ లో ఎక్కడైనా సరే ఏ రంగంలో నైనా సరే పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయి.కానీ ఈ విషయంపై అతి తక్కువ మంది దృష్టి పెడుతున్నారట.

ఓ సర్వే ప్రకారం విదేశాలలో పెట్టుబడులు పెట్టి ఆయా దేశాల పౌరసత్వం పొందాలనుకునే వారిలో భారతీయులే ముందు వరుసలో ఉన్నారట.ఇలా ఎన్నో కారణాలు భారతీయులను భారత పౌరసత్వం వదులుకునేలా చేస్తోందని అయితే పౌరసత్వం వదులుకోవడం అనేది భాదాకరమైన విషయమేనని అంటున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube