దీపికకు ఇష్టమైన సౌత్ ఇండియన్ ఫుడ్ ఏంటంటే..?

సాధారణంగా అభిమానులకు తమ ఫేవరెట్ హీరోహీరోయిన్ల అలవాట్ల గురించి, అభిరుచుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.కొందరు అభిమానులు తమ ఫేవరెట్ హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు.

 Rice Rasam Is Deepika Padukone Favourite Comfort Food In South India, Deepika Pa-TeluguStop.com

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు తన ఫేవరెట్ ఫుడ్ గురించి ప్రశ్న ఎదురు కాగా ఆమెకు ఇష్టమైన ఫుడ్ కు సంబంధించిన దీపిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

తనకు ఇంట్లో తయారు చేసిన ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని.

అన్నంతో రసం కలిపి తినడం తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.దీపికా తనకు ఇష్టమైన ఫుడ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోకు 11,31,278 లైకులు రాగా వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.దీపికా పదుకొనే బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ సౌత్ ఇండియా ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడటం గమనార్హం.

ఈ మధ్యే తన 35వ పుట్టినరోజున జరుపుకున్న దీపికా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ ఏడాది ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ మొదలు కానుంది.ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు.ఈ ఏడాది సెకండాఫ్ లో నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది.

మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో బాలీవుడ్ లో సైతం ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.బాలీవుడ్ సెలబ్రిటీలు సౌత్ ఇండియన్ వంటకాలు ఇష్టమని చెబుతూ ఉండటంతో ఆయా హీరోయిన్ల అభిమానులు అవాక్కవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube